https://oktelugu.com/

Boney Kapoor: శ్రీదేవి నన్ను తిట్టి ఆరు నెలల మాట్లాడలేదు… ఎట్టకేలకు ఆ వివాదం బయటపెట్టిన భర్త బోనీ కపూర్!

శ్రీదేవి భర్త బోని కపూర్ లేటెస్ట్ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. శ్రీదేవి తనతో గొడవ పడిందని, ఆమె ఆరు నెలలు నాతో మాట్లాడలేదని ఆయన తెలియజేశారు. శ్రీదేవి మరణం అనంతరం కీలక విషయం బయటపెట్టాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : December 25, 2024 / 03:38 PM IST

    Boney Kapoor

    Follow us on

    Boney Kapoor: ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది శ్రీదేవి. సౌత్ లో మొదలైన ఆమె ప్రస్థానం నార్త్ కి పాకింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా సిల్వర్ స్క్రీన్ కి శ్రీదేవి పరిచయమైంది. తమిళ, తెలుగు భాషల్లో వందల చిత్రాలు చేసింది. స్టార్డం అనుభవించింది. సౌత్ లో రాణిస్తూనే హిందీ చిత్రాల్లో నటిస్తూ అక్కడ పాపులారిటీ రాబట్టింది. ఒక దశలో బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా తిరుగులేని ఆధిపత్యం ఆమె కనబరిచారు. శ్రీదేవి పెళ్లి వార్త అప్పట్లో ఒక సంచలనం. అతిలోక సుందరిగా పేరున్న శ్రీదేవి… పెళ్ళై ఇద్దరు పిల్లలున్న బోనీ కపూర్ ని వివాహం చేసుకోవడం అభిమానులకు కూడా నచ్చలేదు.

    1996లో శ్రీదేవి-బోనీ కపూర్ వివాహం చేసుకున్నారు. బోనీ కపూర్ మొదటి భార్య పేరు మోనా. ఇక శ్రీదేవికి ఇద్దరు అమ్మాయిలు సంతానం. పెద్దమ్మాయి జాన్వీ కపూర్ కాగా చిన్నమ్మాయి పేరు ఖుషి కపూర్. జాన్వీ కపూర్ హీరోయిన్ గా రాణిస్తుంది. సౌత్ లో కూడా అడుగుపెట్టిన జాన్వీ కపూర్ దేవర మూవీలో నటించిన సంగతి తెలిసిందే. కాగా బోనీ కపూర్ తన ప్రేమ కహానీ తాజాగా పంచుకున్నారు.

    తన ప్రేమను శ్రీదేవితో వ్యక్తపరిచినప్పుడు ఆమె కోప్పడ్డారట. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న నీవు నాతో ఈ మాట ఎలా చెబుతావని, అసహనం వ్యక్తం చేసిందట. దాదాపు ఆరు నెలలు బోని కపూర్ తో శ్రీదేవి మాట్లాడలేదట. శ్రీదేవిపై తనకున్న ప్రేమను బోనీ కపూర్ ఆమెకు అర్థమయ్యేలా వ్యక్తం చేశాడట. అప్పుడు శ్రీదేవి మెత్తబడ్డారట. బోనీ కపూర్ ప్రేమను అంగీకరించిందట. ఇక మొదటి భార్య మోనాతో పాటు పిల్లలకు కూడా తన ప్రేమ సంగతి తెలియజేశాడట. వారు కూడా అర్థం చేసుకున్నారట.

    శ్రీదేవి అంటే నాకు ప్రాణం. నా చివరి శ్వాస వరకు ఆమెను ప్రేమిస్తూనే ఉంటానని బోని కపూర్ చెప్పుకొచ్చారు. కాగా శ్రీదేవి 2018లో ప్రమాదవశాత్తు కన్నుమూసింది. దుబాయిలో ఓ హోటల్ లో బాత్ టబ్ లో ఆమె శవమై కనిపించారు. అందం కోసం కఠినమైన డైట్ ని ఫాలో అయ్యే శ్రీదేవి… అప్పుడప్పుడు కళ్ళు తిరిగిపడిపోయేవారట. దుబాయ్ హోటల్ లో కూడా శ్రీదేవి ఇదే కారణంగా బాత్ టబ్ లో పడి కన్నుమూశారనే వాదన ఉంది.