https://oktelugu.com/

Baltic Sea: సముద్ర అంతర్భాగంలో పదివేల ఏళ్ళనాటి రాతి గోడ.. పరిశోధకుల పరిశీలనలో షాకింగ్ నిజాలు

మంచు స్పటికాల ద్వారా తీర ప్రాంతం ప్రభావితం అవుతుందని మేము అనుకోవడం లేదు. సునామీ లేదా ఇతర సంఘటనల వల్ల ఇలాంటి గోడ ఏర్పడుతుందని రుజువులు లేవు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 14, 2024 / 06:57 PM IST
    Follow us on

    Baltic Sea: అప్పట్లో 2002లో నాసా అంతరిక్షం నుంచి ఓ చిత్రం తీస్తే రామసేతు కనిపించింది. రామాయణంలో యుద్ధకాండ సమయంలో రామసేతు ప్రస్తావన ఉంది. తమిళనాడులోని రామేశ్వరం వద్ద గల ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని మన్నార్ ద్వీపాల వరకు 48 కిలోమీటర్ల పొడవుతో మూడు కిలోమీటర్ల వెడల్పుతో దీనిని నిర్మించారు. ఈ వారధిని సేతుబంధ రామేశ్వరం అంటారు. 15వ శతాబ్దం వరకు ఈ రామసేతు భారత్ శ్రీలంక వరకు నడకమార్గానికి అందుబాటులో ఉండేది. 1480లో వచ్చిన తుఫాన్ ప్రభావం వల్ల ఈ వంతెన ధ్వంసం అయింది. అయితే ఇప్పుడు ఐరోపాలో దాదాపు ఇలాంటి ఒక వందల ఏళ్ల సంవత్సరాల నాటి గోడను పరిశోధకులు కనుగొన్నారు. ఐరోపాఖండంలోని జర్మనీలో బాల్టిక్ సముద్రం కింద ఈ రాతియుగం నాటి గోడను పరిశోధకులు వెలుగులోకి తీసుకొచ్చారు. మెక్లెన్ బర్గ్ బే లో పది కిలోమీటర్ల సముద్ర అంతర్భాగంలో శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులు మల్టీ బీమ్ సోనార్ సిస్టం ద్వారా పరిశీలించినప్పుడు ఇది కనిపించింది. ఈ రాతిగోడలో 1,673 రాళ్ళు ఉన్నాయి. ఈ గోడ ఒక మీటర్ కంటే తక్కువ ఎత్తులో ఉంది. 971 మీటర్ల దూరం వరకు విస్తరించి ఉంది. దీనిని నాసా ఓరియన్ నెబ్యూలా 3D ద్వారా ఈ చిత్రాన్ని తీసింది. ఈ పురాతన రాతి గోడ సహజమా? లేకుంటే సునామీ లేదా హీమానీ నదాల కలయిక వల్ల ఏర్పడిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే సహజ ప్రక్రియల ద్వారా ఈ గోడ ఏర్పడే అవకాశం లేదని పరిశోధకులు చెబుతున్నారు.

    ” మంచు స్పటికాల ద్వారా తీర ప్రాంతం ప్రభావితం అవుతుందని మేము అనుకోవడం లేదు. సునామీ లేదా ఇతర సంఘటనల వల్ల ఇలాంటి గోడ ఏర్పడుతుందని రుజువులు లేవు. ఈ గోడను మనుషులు నిర్మించారని మేము నమ్ముతున్నామని” ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ లో పరిశోధకులు పేర్కొన్నారు. బ్లింకర్ వాల్, నిక్ పాయింట్ వద్ద ఈ గోడ అతిపెద్ద రాళ్ల సమూహంగా ఈ గోడ ఉందని వారు వివరించారు.

    ఈ గోడను పదివేల సంవత్సరాల క్రితం నిర్మించారని పరిశోధకులు చెబుతున్నారు. అప్పట్లో ఈ గోడ నిర్మించినప్పుడు ఈ ప్రాంతమంతా సరస్సు లాగా ఉండేదని వారు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో వేట కోసం ఈ గోడను నిర్మించి ఉంటారని వారు పేర్కొంటున్నారు. అయితే ఈ గోడ నిర్మాణం వెనుక కచ్చితమైన ప్రయోజనాన్ని చెప్పలేమని.. రెయిన్ డీర్ మందలను వేటాడేందుకు వేటగాళ్లు ఈ గోడను ఉపయోగించి ఉంటారనే పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ గోడను ఒక కృత్రిమ అడ్డంకిగా సృష్టించి రెయిన్ డీర్ లను అడ్డుకొని, వాటిని చంపేశారేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

    “రెయిన్ డీర్ లు నీళ్లల్లో ఈత కొట్టినప్పటికీ వాటి గమనానికి ఈ గోడ అడ్డుగా ఉండేది కావచ్చు. అప్పుడు పైన ఉన్న వేటగాళ్లు బాణాలు, ఈటెలు, పదునైన ఆయుధాలతో వేటాడే వారని” పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ” సముద్రమట్టాలు పెరగడం వల్ల క్రమక్రమంగా ఈ గోడ మునిగిపోయింది. సుమారు 8,500 సంవత్సరాల క్రితమే ఇది కూడా మునిగిపోయి ఉంటుందని” పరిశోధకులు చెప్తున్నారు. గోడ మీద ఉన్న ఆనవాళ్ళు ఆధారంగా నాటి ప్రజల జీవన విధానాన్ని అంచనా వేసేందుకు తోడ్పడుతుందని పరిశోధకులు అంటున్నారు.