https://oktelugu.com/

Mea Jackie Mangoes : జపాన్ లో జత మామిడి పండ్లు 5000 డాలర్లు.. బంగ్లాదేశ్ లో 2000 టాకాలే.. అసలేంటి ప్రత్యేకతంటే?

Mea Jackie Mangoes అధునాతన పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. బంగ్లాదేశ్ రైతులు మాత్రం సాంప్రదాయ విధానాల్లోనే మామిడి తోటలను పెంచుతూ.. దిగుబడి సాధిస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 28, 2024 / 10:54 PM IST

    A pair of Sun Egg mangoes in Japan is 5000 dollars

    Follow us on

    Mea Jackie Mangoes : అవి అలాంటి ఇలాంటి మామిడి పండ్లు కావు. ప్రపంచంలో జపాన్లోనే పండుతాయి. ఆ మామిడి పండ్ల ఉత్పత్తి డిమాండ్ కు తగ్గట్టుగా ఉండదు. పైగా ఆ మామిడి పండ్లు అత్యంత అరుదైనవి. వాటిని పెంచే విధానం కూడా అత్యంత పకడ్బందీగా ఉంటుంది. ఆ మామిడిపండ్లలో మాంసకృతులు, విటమిన్లు, పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి. అందువల్లే వాటిని శ్రీమంతులు మాత్రమే కొనుగోలు చేస్తారు. మనదేశంలో అంబానీ, అదానీ, సచిన్ టెండూల్కర్ వంటి వారికి జపాన్ నుంచి ఆ పండ్లు ప్రత్యేకంగా వస్తాయి. వృక్ష శాస్త్ర పరిభాషలో ఈ మామిడి “సన్ ఎగ్” అని పిలుస్తుంటారు.. సీజన్లో ఒక జత మామిడి పండ్లు 5000 డాలర్ల వరకు పలుకుతాయి.. ఈ మామిడిపండ్ల తోటలను జపాన్లో చాలా జాగ్రత్తగా సాగు చేస్తారు..

    అయితే ఈ మీయాజాకి మామిడి పండ్లు.. బంగ్లాదేశ్ లో విస్తారంగా సాగవుతున్నాయి. జపాన్ నుంచి కొంతమంది ఔత్సాహిక రైతులు ఈ మామిడి విత్తనాలను దిగుమతి చేసుకున్నారు. వాటిని క్రమంగా సాగు చేయడం మొదలుపెట్టారు. సాగును క్రమేపీ విస్తరించారు. 2024 లో ఏకంగా 25 టన్నుల మీయాజాకి మామిడి పండ్లను ఉత్పత్తి చేశారు. భవిష్యత్తులో మరింత ఎక్కువ దిగుబడి సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.. కిలో మీయాజాకి మామిడి పండ్లను 1000 నుంచి 2000 టాకాలకు విక్రయిస్తున్నారు.

    జపాన్ దేశంతో పోలిస్తే భిన్నమైన విధానంలో ఈ పంటను సాగు చేస్తున్నారు.. జపాన్ లో సాగయ్యే మీయా జాకీ మామిడిపండు స్పష్టమైన ఎరుపు రంగులో ఉంటే.. బంగ్లాదేశ్ లో ఉత్పత్తి అవుతున్న మామిడిపండు లేత ఎరుపు రంగులో ఉంది. రంగులో తేడా ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్లో ఉత్పత్తి అవుతున్న మీయాజాకి మామిడి పండ్లకు విపరీతమైన ఆదరణ ఉందని అక్కడి రైతులు చెబుతున్నారు.. బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఈ మామిడి తోటల సాగును ప్రోత్సహిస్తోంది. రైతులు కూడా గ్రీన్ హౌస్ లో పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జపాన్లో రైతులకు ఆర్థిక స్థిరత్వం ఎక్కువ కాబట్టి.. అధునాతన పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. బంగ్లాదేశ్ రైతులు మాత్రం సాంప్రదాయ విధానాల్లోనే మామిడి తోటలను పెంచుతూ.. దిగుబడి సాధిస్తున్నారు.