Iraq : అసలే దరిద్రపు దేశం.. పైగా దిక్కుమాలిన చాందసవాదం.. ఆడపిల్లలను బతకనివ్వరేంట్రా?

తాజాగా పార్లమెంట్లో ఈ బిల్లు తెరపైకి రావడం విశేషం.. అయితే ఈ బిల్లు కార్యరూపం దాల్చితే ఆడపిల్లల సంఖ్య మరింత తగ్గుతుందని, అప్పుడు దేశంలో లింగ సమానత్వం మచ్చుకు కూడా కానరాదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Written By: NARESH, Updated On : August 10, 2024 11:07 am

A bill to lower the age of marriage for girls in Iraq to 9 years

Follow us on

Iraq : పెద్దగా చదువుకోవద్దు. చెప్పిన దానికి ఎదురు చెప్పకూడదు. అన్నింటికీ తలవంచాలి. చివరికి మొఖం కూడా కనిపించకుండా దుస్తులు ధరించాలి. వ్యక్తిగత ఆరోగ్యం ఎలా ఉన్నా పర్వాలేదు.. పడక సుఖం అందించాలి. ఎంతమంది పిల్లల్నయినా కనాలి. కనీస హక్కులు ఉండవు. ఇష్టంగా బతికే స్వేచ్ఛ ఉండదు. స్థూలంగా చెప్పాలంటే వాళ్ళ కంటే అడవిలో జీవిస్తున్న జంతువులు నయం. అలాంటి దేశంలో ఇప్పుడు మరో నిబంధన తెరపైకి వచ్చింది. ఈ నిబంధన ఎలా ఉందంటే.. ఇక భవిష్యత్తులో అక్కడ ఆడవాళ్లకు ఏ మాత్రం భద్రత ఉండదు. కనీసం ఏదైనా నచ్చని విషయం పై అభిప్రాయం చెప్పే అవకాశం కూడా ఉండదు. ఇంతకీ ఏంటి ఆ దేశం? ఆడవాళ్ళ విషయంలో ఇంత దారుణంగా ఎందుకు వ్యవహరిస్తోంది? తెరపైకి మరో కొత్త నిబంధన ఏం తీసుకొస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

ఆసియాలో చమరు ఇతర దేశాలకు ఎగుమతి చేసి.. వచ్చిన విదేశీ మారకద్రవ్యం వల్ల బతికే దేశాలలో ఇరాక్ ఒకటి. ఇస్లాం దేశమైన ఇరాక్ లో చాందసవాదం విపరీతంగా ఉంటుంది. పైగా ఈ దేశ పాలకులు ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ దేశం పార్లమెంట్లో అక్కడి ప్రభుత్వం ఓ బిల్లు ప్రతిపాదించింది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమౌతోంది. అమ్మాయిల వివాహ వయసు 9 ఏళ్లకు తగ్గించాలంటూ ఆ బిల్లును ప్రతిపాదించడం పెద్ద ఎత్తున చర్చకు కారణం అవుతోంది. ఈ బిల్లును ఇరాక్ లోని న్యాయ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టడం కలకలానికి కారణమవుతోంది. పర్సనల్ స్టేటస్ లా ను సవరించేందుకు దీనిని తీసుకువచ్చారని తెలుస్తోంది. ఒకవేళ ఈ బిల్లు కనుక పాస్ అయితే బాలికలు 9 సంవత్సరాలు, బాలురు 15 సంవత్సరాలకు వివాహం చేసుకునేందుకు చట్టపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇరాక్ లో ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం అమ్మాయిల వివాహ వయసు 18 సంవత్సరాలుగా ఉంది.. ఈ చట్టం వల్ల బాల్య వివాహాలు పెరుగుతాయని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇంతకాలం ఇరాక్ లో సాధించిన పురోగతి, మహిళా సాధికారత, లింగ సమానత్వం సర్వనాశనం అవుతుందని అక్కడి సంఘాల నాయకులు చెబుతున్నారు.

మన వైపు ఈ బిల్లు పట్ల అంతర్జాతీయంగా మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. “వివాహ వయసును తగ్గించడం అనేది దిక్కుమాలిన చర్య. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు. దీనిపై మేము అడిగే ప్రశ్నలకు ఏమాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇలాంటి బిల్ పాస్ అయితే అది బాలికల విద్యపై, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల చాలామంది బాలికలు చదువును మధ్యలోనే మానేస్తారు. ఫలితంగా చిన్న వయసులోనే గర్భం దాల్చే ప్రమాదం ఉంటుంది. గృహహింస మరింత పెరుగుతుంది. అది వారి ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి సమయంలో ఆడపిల్లలను కనేందుకు ఎవరూ ముందుకు రారని” అంతర్జాతీయ మహిళా సంఘాల నాయకులు వాపుతున్నారు. యూనిసెఫ్ నివేదిక ప్రకారం ఇరాక్లో 18 సంవత్సరాల లోపు పెళ్లిళ్లు చేసుకుంటున్న బాలికల సంఖ్య 28 శాతం గా ఉంది. పెళ్లిళ్ల వయసు కుదించేందుకు గత ఏడాది ఇరాక్ పార్లమెంట్లో ప్రయత్నం జరిగింది. అయితే అప్పట్లో పలువురు చట్ట సభ్యులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీనివల్ల దేశం పరువు పోతుందని ఆక్షేపించారు. ఆ తర్వాత మళ్లీ తాజాగా పార్లమెంట్లో ఈ బిల్లు తెరపైకి రావడం విశేషం.. అయితే ఈ బిల్లు కార్యరూపం దాల్చితే ఆడపిల్లల సంఖ్య మరింత తగ్గుతుందని, అప్పుడు దేశంలో లింగ సమానత్వం మచ్చుకు కూడా కానరాదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.