100-Year-Old WWII Veteran: బ్రిటన్.. ఒకప్పడు ప్రపంచంలో అగ్రరాజ్యం. అనేక దేశాలను ఆక్రమించి సంపదను దోచుకుపోయింది. ఆర్థికంగా బాగా ఎదిగింది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు గెలిచింది. కానీ ప్రస్తుతం బ్రిటన్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. జీడీపీ దారుణంగా పడిపోతోంది. ఆర్థికంగా దిగజారుతోంది. ఇలాంటి తరుణంలో బ్రిటన్‌లో ఒక మాజీ సైనికుడి ఆవేదన ప్రపంచవ్యాప్తంగా చర్చా అంశమైంది. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఈ 99 ఏళ్ల వీరుడు ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకున్నారు. మన కోసం వందల మంది సహచరులు ప్రాణాలు అర్పించారు. కానీ ఈ రోజున ఆ త్యాగాలకు గౌరవం లేకుండా పోయింది అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మాటలు బ్రిటన్ సమాజాన్ని కదిలించాయి.
యుద్ధాలు చేయలేని పరిస్థితి..
మాజీ సైనికుడి వ్యాఖ్యల్లో ఒక భయానక నిజం దాగుంది. ఇప్పటి బ్రిటన్ యుద్ధం చేసినా గెలవలదు. అప్పట్లో ఉన్న ఉత్సాహం, త్యాగం, సైనిక దృఢత ఇప్పుడు కనిపించడంలేదని చెప్పడం దేశపు ప్రస్తుత స్థితిని సూచిస్తోంది. ప్రపంచ యుద్ధాల్లో అగ్రశక్తిగా నిలిచిన బ్రిటన్, ఇప్పుడు ఆ బలం కోల్పోయిందన్న ఆవేదన స్పష్టంగా బయటపడింది.
బ్రిటన్‌ను గెలిపించిన భారత సైన్యం
మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో బ్రిటన్ విజయాలకు కీలక కారణం భారత సైనికుల సహకారం. లక్షలాది భారత జవాన్లు యూరప్, ఆఫ్రికా, ఆసియా రంగభూముల్లో పోరాడి బ్రిటన్ సైన్యానికి ఆత్మవిశ్వాసం ఇచ్చారు. నేటి వరకు ఆ పాత్రకు సరైన గుర్తింపు లభించకపోయినా, చరిత్ర మాత్రం అది మరిచిపోలేదు.
కాలం తిరిగిపోయింది
ఒకప్పుడు ప్రపంచాన్ని పాలించిన సామ్రాజ్యం ఇప్పుడు ఆర్థికంగా క్షీణించింది. భారత స్వాతంత్య్రానంతర దశాబ్దాల్లో బ్రిటన్ మన వనరులపై ఆధారపడి బతికింది. కానీ ఇప్పుడు ఘనత క్రమంగా తగ్గింది. ఆర్థిక వ్యవస్థ మందకొడిగా మారింది. నేటి పరిస్థితుల్లో భారత్ జీడీపీ, పారిశ్రామిక అనుమతులు, డిజిటల్ పాలన, ఉత్పత్తి రంగాల్లో బ్రిటన్ కంటే ముందంజలో ఉంది. ప్రపంచ మార్కెట్‌లో భారత్ ఇప్పుడు స్వతంత్ర శక్తిగా ఎదిగింది. ఒకప్పుడు భారత వనరులను వాడుకుని జీవించిన బ్రిటన్ ఇప్పుడు భారత ఆర్థిక, సాంకేతిక పురోగతిని చూసి ఆశ్చర్యపోతుంది.
ప్రపంచ యుద్ధాలను గెలిచిన పాతశక్తులు క్రమంగా వెనక్కి తగ్గుతుండగా, కాలానికి తగ్గట్టు ఎదిగిన దేశాలు కొత్త నాయకత్వం తీసుకుంటున్నాయి. బ్రిటన్ మాజీ సైనికుడి కంటినీరు అది గుర్తుచేస్తోంది. ప్రపంచ వ్యూహంలో అసలు బలం ఎవరిదో ఇప్పుడు స్పష్టమవుతోంది. చరిత్ర ఇప్పుడు భారత్‌కు కొత్త బలం ఇచ్చింది. ఒకప్పుడు దోపిడీకి గురైన దేశం, ఇప్పుడు అన్నివిధాలా బ్రిటన్ కంటే ముందు ఉంది.
“BRITAIN BETRAYED US!” — WW2 Veteran, 99, broke down in tears, saying he no longer recognises the country he once fought for. “It wasn’t worth it,” he said quietly — leaving viewers stunned and the nation heartbroken. pic.twitter.com/wOhwyMBU8s
— Imtiaz Mahmood (@ImtiazMadmood) November 9, 2025