500 percent tariffs on India: ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డ చందంగా మారింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముగించడానికి ఇప్పుడు భారత్‌పై బాంబు పేల్చాలని నిర్ణయించాడు. రష్యాను ఒప్పిండమో.. ఢీకొనడం సాధ్యం కాక.. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న భారత్‌పై భారీగా టారిఫ్ విధించేందుకు పావులు కదుపుతున్నారు. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల చట్టానికి అంగీకారం తెలిపారు.
బిల్లులో ఏముంది..?
సెనేటర్ గ్రాహం ఎక్స్‌లో పోస్ట్ పెట్టి ట్రంప్‌తో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం సుంకాలు విధించే అధికారాన్ని యుఎస్ పొందుతుంది. వచ్చే వారంలో ఓటింగ్ జరుగనుంది. పుతిన్ యుద్ధానికి పరోక్షంగా నిధులు అందించడానికి భారత్, చైనా కారణమని ట్రంప్ ఆరోపణ.
భారత్, చైనాపై ప్రభావాలు
చైనా ప్రపంచంలోని అతిపెద్ద రష్యన్ చమురు కొనుగోలుదారు, భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ ఆంక్షలు రక్తపాతానికి మద్దతును కట్టడి చేస్తాయని గ్రాహం వాదన. గతేడాది భారత దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించినట్లే ఇప్పుడు మరింత గట్టిగా ఉంటుంది.
వాణిజ్య చర్చలకు విఘాతం..
భారత్–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్నాయి. ఈ బిల్లు ఆంక్షలు ఈ సంభాషణలను ప్రభావితం చేస్తాయి. భారత్ ఆర్థిక వ్యవస్థకు చమురు ధరల పెరుగుదల భారాన్ని మోపవచ్చు. పుతిన్ శాంతి మాటలు చెబుతూనే యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని గ్రాహం విమర్శించారు. ఈ ఆంక్షలు మాస్కో ఆదాయాలను తగ్గించి ఉక్రెయిన్‌కు మద్దతును బలోపేతం చేస్తాయి. బ్రెజిల్ వంటి ఇతర దేశాలు కూడా ఈ జాబితాలో చేరతాయి.
మోదీ ఏం చేస్తారు?
ఈ చర్య భారత్‌కు రష్యన్ చమురు ఆధారాన్ని ప్రశ్నిస్తుంది. ప్రత్యామ్నాయ మూలాలు కనుగొనడం, యుఎస్‌తో దౌత్య చర్చలు జరపడం అవసరం. ట్రంప్ విధానం ఉక్రెయిన్ యుద్ధాన్ని త్వరగా ముగించే అవకాశాన్ని కల్పిస్తుంది. కానీ ఆర్థిక సవాళ్లను తెచ్చిపెడుతుంది. ఈ నేపథ్యంలో మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మోదీ నిర్ణయంపైనే భారత ఎగుమతులు ఆధారపడి ఉంటాయి.