https://oktelugu.com/

Holton : 33 ఏళ్లకే 317 కిలోల బరువు! క్రేన్లు పట్టి లేపిన మనిషి ఇక లేడు

తాను రోజుకు 10 వేల కేలరీల ఆహారం తీసుకునేవాడు. ఈ విషయాన్ని గతేడాది ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇదే ఇంటర్వ్యూలో తన సమయం అయిపోయిందని ముందే చెప్పాడు. మరణాన్ని ముందే ఊహించాడు. చెప్పిట్లుగానే జరిగింది.

Written By:
  • NARESH
  • , Updated On : May 6, 2024 / 03:25 PM IST

    317 kg Holton from the United Kingdom died

    Follow us on

    ఊబకాయం.. అధిక బరువు ఇటీవల అతిపెద్ద సమస్యగా మారింది. జంక్‌ ఫుడ్, మానసిక ఒత్తిడి, హోటల్‌ ఫుడ్స్, కొలెస్ట్రాల్‌ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడంతోపాటు, జీన్స్‌ ప్రభావంతో ఊబకాయులు పెరుగుతున్నారు.యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన ఓ వ్యక్తి 317 కిలోల బరువుతో భారీ ఊబకాయుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన జేసన్‌ హోల్టన్‌ 33 ఏళ్లకే కన్నుమూశాడు. ఆర్గాన్‌ ఫెయిల్యూర్, స్థూలకాయం కారణంగా అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. అతడిని కాపాడేందకు డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సర్రేలో నివసిస్తున్న హోల్టన్‌ను ఆస్పత్రికి తీసుకురావడం కూడా కష్టమైంది. మొదట అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అబులెన్స్‌ వచ్చింది. అతడి భారీకాయం చూసి వారు అగ్నిమాపక శాఖకు ఫోన్‌ చేశారు. వారు క్రేన్‌ సాయంతో వచ్చి ఇంటి నుంచి రాయల్‌ సర్రే ఆస్పత్రికి తరలించారు.

    ముందే చెప్పిన డాక్టర్లు..
    హోల్టన్‌ మృతిపై అతని తల్లి లీసా మాట్లాడింది. కొడుకు మరణాన్ని ధ్రువీకరించింది. హోల్టన్‌ రెండు కిడ్నీలు మొదట ఫెయిల్‌ అయ్యాయని తెలిపింది. దీంతో డాక్టర్లు వారం రోజులకు మించి బతకడని చెప్పారని వెల్లడించింది. వారం రోజులుగా హోల్టన్‌ ఆరోగ్యం క్షిణిస్తూ వచ్చిందని పేర్కొంది. ఇప్పటికే అతను ఎనిమిదిసార్లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. తొమ్మిదోసారి అలాగే జరుగుతుందని భావించినా అలా జరగలేదని తెలిపింది.

    ప్రత్యేక బంగ్లాలో నివాసం..
    హోల్టన్‌ భారీకాయం కారణంగా ప్రత్యేక బంగ్లాలో నివసించేవాడు. అందులో తన సైజ్‌కు తగినట్లుగా మంచం, ఫర్నిచర్‌ ఉండేవి. మంచానికే పరిమితం కావడంతో శ్వాసకోస సమస్యలు కూడా ఎదుర్కొన్నాడు. రక్తం గడ్డకట్టడంతో 2022లో రెండుసార్లు పక్షవాతానికి గురయ్యాడు.

    ఎక్కువ ఆహారం తినడం వలన..
    హోల్టన్‌ టీనేజీలో ఉన్నప్పుడే అతని తండ్రి చనిపోయాడు. ఆ బాధనుంచి బయటపడేందకు ఎక్కువ ఆహారం తీసుకోవడం మొదలు పెట్టాడు. అతి అలవాటుగా మారింది. దీంతో అతని బరువు అంతకంతకూ పెరిగింది. తాను రోజుకు 10 వేల కేలరీల ఆహారం తీసుకునేవాడు. ఈ విషయాన్ని గతేడాది ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇదే ఇంటర్వ్యూలో తన సమయం అయిపోయిందని ముందే చెప్పాడు. మరణాన్ని ముందే ఊహించాడు. చెప్పిట్లుగానే జరిగింది.