Parliament Elections 2024
Parliament Elections 2024 : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మే 5న ఎన్నికల ప్రచారం ముగిసింది. దేశవ్యాప్తంగా 92 స్థానాలకు మూడో విడతలో పోలింగ్ జరుగుతుంది. ఇందులో గుజరాత్‌లోని 25 స్థానాలు, కర్ణాటకలోని 14 స్థానాలు ఉన్నాయి.
రెండు విడతల్లో 190 స్థానాలకు ఎన్నికలు..
దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో మొదటి విడతలో 102 స్థానాలకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరిగాయి. రెండో విడతలో 88 స్థానాలకు పోలింగ్ జరిగింది. తాజాగా మే 7న 88 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. గుజరాత్, కర్ణాటక, అసోం, బిహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, దాద్రానగర్ హవేలి, డామన్ డయ్యూ సహా 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతాయి.
నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి..
మూడో విడతలో దేశంలోని గుజరాత్, అసోం, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.మంగళవారం(మే 7న) ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఎన్నికల బరిలో ముఖ్య నేతలు..
ఈ విడత ఎన్నికల బరిలో కీలక నేతలు ఉన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రులు జ్యోతిరాధిత్య సింధియా (గుణ – మధ్య ప్రదేశ్) నుంచి బరిలో ఉన్నారు. పురుషోత్తం రూపాల రాజ్‌కోట్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రహ్లాద్ జోషి.. కర్ణాటకలోని ధార్వాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. మధ్య ప్రదేశ్ నుంచి మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్.. విదిశ నుంచి బరిలో ఉంటే…. రాజ్ ఘర్ నుంచి దిగ్విజయ్ సింగ్ పోటీ ఉన్నారు. కర్ణాటకలోని హవేరి నుంచి మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై బరిలో ఉన్నారు.
మూడో విడత ఎన్నికల తర్వాత 283 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. మరో నాలుగు విడతల్లో 262 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఏడు దశల ఎన్నికల తర్వాత జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.