South Korea : ప్రపంచంలో వరుస విమాన ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణంగా నేపాల్‌లో ఎక్కువగా విమాన ప్రమాదాలు జరుగుతుంటాయి. శీతాకాలంలో మంచు కారణంగా నేపాల్‌లో విమానాలు క్రాష్ అవుతుంటాయి. తాజాగా కజకిస్థాన్‌లో కూడా పొగ మంచు కారణంగానే విమానం కూలిపోయింది. వాతావరణం సరిగా లేకపోవడంతో విమానాన్ని మళ్లించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. పైలట్ అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించినా కూలిపోయింది. ప్రయాణికులతోపాటు, సిబ్బంది కూడా మరణించారు. ఈ ఘటన నాలుగు రోజుల క్రితమే జరిగింది. తాజాగా దక్షిణ కొరియాలో మరో ఘోర విమాన ప్రమాదం జరుగుతుంది. ఈ ఘటనలో కూడా ప్రయాణికులు మృతిచెందారు.
ల్యాండింగ్ సమయంలో..
దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఎయిర్‌పోర్టులో ఉన్న గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 28 మంది ప్రయాణికులు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. ఎయిర్ పోర్టులో దట్టమైన పొగ అలుముకుంది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
175 మంది ప్రయాణికులు..
ఇక ప్రమాద సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆరుగురు సిబ్బంది కూడా ఉన్నారు. విమానం బ్యాంకాక్ నుంచి మువాన్‌కు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సేఫ్‌గా ల్యాండ్ అవుతుందని అందరూ అనుకుంటున్న సమయంలో రన్‌వేపై అదుపు తప్పింది. విమానాశ్రయంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
BREAKING: New video shows moment Boeing 737-800 plane carrying 181 people onboard crashes at Muan International Airport in South Korea.
pic.twitter.com/konxWBpnWy— AZ Intel (@AZ_Intel_) December 29, 2024
Video: Moments after plane carrying 181 people crashed at Muan International Airport in South Korea.pic.twitter.com/0DtXEeKuLc
— AZ Intel (@AZ_Intel_) December 29, 2024