Chiranjeevi : సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ఎంత ఎక్కువ చెప్పుకున్న తక్కువే అవుతుంది. ఎందుకంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థాయి తగ్గకుండా మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించి మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ వచ్చాడు. అలాగే తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని సైతం తట్టుకొని నిలబడడానికి చిరంజీవి చాలా వరకు హెల్ప్ చేశాడు. ఇక మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి చేసిన సేవలు అంతా ఇంతా కాదు. మరి ఏది ఏమైనా కూడా చిరంజీవి లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇక చిరంజీవి చేసిన అన్ని సినిమాలు యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలే కావడం విశేషం… ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ ని పండించడంలో తనను మించిన వారు మరొకరు ఉండరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక యావత్ సినిమా ప్రేక్షకులందరూ అతనికి మాస్ సినిమాల వల్లే బాగా దగ్గరయ్యారు.
అందువల్లే అతను ఎక్కువగా మాస్ ఎలిమెంట్స్ ఉండే విధంగా చూసుకుంటూ ఉంటాడు. మరి ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ చిరంజీవికి హర్రర్ సినిమాలు చూడమంటే కొంతవరకు భయం అంటూ అప్పట్లో సరదాగా చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే.
ఇక ఒక సినిమాను చూసి ఆయన విపరీతంగా భయపడ్డాడట ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే రాఘవ లారెన్స్ తీసిన కాంచన… నిజానికి ఈ మూవీలో చాలా హర్రర్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. ప్రేక్షకుడు థియేటర్లో చూసినప్పుడు చాలా వరకు భయాందోళన కలిగించే సీన్స్ అయితే వస్తు ఉంటాయి. అందువల్ల చిరంజీవి ఈ సినిమా చూసినప్పుడు తను కూడా భయపడ్డట్టు ఒక సందర్భంలో తెలియజేశాడు. నిజంగా రాఘవ లారెన్స్ ను ఎంకరేజ్ చేసింది కూడా చిరంజీవి గారే కావడం విశేషం…
అయితే రాఘవ లారెన్స్ కాంచన సినిమా విషయంలో చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారంటూ అతన్ని పొగుడుతూనే ఆ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు భయంతో వణికిపోతున్నారు ఏం సినిమా తీసావ్ అయ్యా అంటూ సరదాగా అన్నారని రాఘవ లారెన్స్ ఇక సందర్భంలో తెలియజేశారు… అయితే లారెన్స్ విషయంలో చిరంజీవి ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటాడనే విషయం మనందరికి తెలిసిందే…