Amit Shah-Jr NTR Meeting: “ఈ నేచర్ లో ఎక్కడో జరిగే ఓ మూమెంట్ ను, మరెక్కడో జరిగే మూమెంట్ డిసైడ్ చేస్తుంది. ఎవ్రీ థింగ్ ఈజ్ ఇంటర్ లింక్ డ్” నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ నోటి నుంచి రకుల్ ప్రీత్ సింగ్ తో చెప్పే డైలాగ్ ఇది. కార్యకారణ సిద్దాంతం ప్రకారం ఇది నూటికి నూరుపాళ్లు నిజం కూడా. ఈ సిద్ధాంతమే అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ తో కార్యరూపం దాల్చింది. దీని వెనుక ఉన్నది ఆర్ఆర్ఆర్ కథకుడు, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మునుగోడు సభ తర్వాత అమిత్ నేరుగా హైదరాబాదులోని నోవాటెల్ కు వచ్చారు. అప్పటికే ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నారు. ఇద్దరు కలుసుకున్నారు. చాలా ప్రశ్నలయ్యాక వారిద్దరు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఇంకా కొందరు డిన్నర్ చేశారు. ఆ తర్వాత 20 నిమిషాల పాటు ఇద్దరు మాత్రమే ఏకాంతంగా మాట్లాడుకున్నారు. దీనిపై అటు అమిత్ షా, ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఎవరూ నోరు మెదప లేదు. పైగా మర్యాద పూర్వక భేటీ అని మీడియాకి చెప్పి వెళ్ళిపోయారు.
-ఎందుకు ఈ భేటీ?
ఏపీలో పొలిటికల్ వ్యాక్యుం లేదు. అక్కడ రెడ్డి వర్సెస్ కమ్మ అన్నట్టుగా రాజకీయం సాగుతోంది. ఇప్పుడు అక్కడ ఎన్టీఆర్ వేలు పెట్టే అవకాశం లేదు. పైగా తన జాన్ జిగ్రీలు వల్లభనేని వంశీ, కొడాలి నాని జూనియర్ వెంట నడిచే పరిస్థితి లేదు. ఒకవేళ సీఎం చేస్తామని ఆఫర్ ఇచ్చినా బీజేపీ ని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే ఉంటుంది. బీజేపీకే కనుక అంత సీన్ ఉంటే ఏపీలో ఎప్పుడో గేమ్ చేంజర్ అయ్యేది. అక్కడ బలపడాలని బిజెపికి ఆసక్తి లేదు. ఆ పార్టీ నాయకులకు అస్సలు లేదు. ఒక వేళ అమిత్ ఆఫర్ ఇచ్చినా ఇప్పటికిప్పుడు జూనియర్ లైవ్ పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశం లేదు. 2009 లో టీడీపీకి ప్రచారం చేసి ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడో ఆయనకి తెలుసు. అప్పట్లో చంద్రబాబు మాట విని కాలికి బలపం కట్టుకొని తిరిగితే పక్కటెముకలు విరిగాయి. ఇక అప్పటి నుంచి రాజకీయాల జోలికి పోలేదు. కొడాలి నానికి గుడివాడ టికెట్ కోసం మాత్రం రెండు సార్లు బాబుకు సిఫారసు చేశాడు. 2018లో కూకట్పల్లి నియోజకవర్గంలో సొంత అక్కను పోటీలోకి దింపినా అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పైగా ఇప్పుడు ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత జమానా కాదు. అసలు రాజకీయాల్లో సినీ తారలను పెద్దగా దేకే పరిస్థితి లేదు. అంతటి చిరంజీవి తత్వం బోధ పడి సినిమాలు తీసుకుంటున్నాడు. కమల్ హాసన్ కూడా దూరంగా ఉంటున్నాడు. రజనీకాంత్ రాజకీయాలు అంటేనే ఆమడ దూరం జరుగుతున్నాడు. పవన్ కల్యాణ్ కిందా మీదా పడుతున్నాడు. ఇలాంటి స్థితిలో, అది బంగారం లాంటి కెరీర్ ను, వందల కోట్ల సంపాదనను వదులుకొని జూనియర్ రాజకీయాల్లోకి రాగలడా? ఒకవేళ వచ్చినా, టీడీపీ తో బీజేపీ పొత్తు పెట్టుకొని ఎన్టీఆర్ ప్రచారం చేసినా.. టీడీపీ అనేది చంద్రబాబు, లోకేష్ బాబు ప్రాపర్టీ, బాలయ్య దానికి ట్రెజరర్. పైగా జూనియర్ పొడను బాలయ్య సహించలేడు.
-మంచి ప్రయారిటీ ఇచ్చినట్టే
అమిత్ షా మునుగోడు సభకు ముందే రామోజీ రావును ఫిలిం సిటీ లో కలిశాడు. అప్పుడే జూనియర్ తో కూడా భేటీ ఉంటుంది అనుకున్నారు. కానీ అమిత్ షా అందుకు నోవాటెల్ ను బుక్ చేశాడు. ఏ తీరుగా జూసినా ఇది మంచి ప్రయారిటీ కిందే లెక్క. ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో జూనియర్ నటన నచ్చి ఉంటే, బాగా చేశావని అభినందించాలంటే ఓ ఫోనో, ట్వీటో చేస్తే సరిపోయేది. విందు ఇవ్వాలి అనుకుంటే ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించాడు. కానీ అతడిని పిలవ లేదు. అసలు ఈ భేటీ ఉద్దేశం అదయితే కదా! ప్రస్తుతం తెలంగాణలో అధికారంలోకి రావడమే బిజెపి టార్గెట్. మూడు నెలల వ్యవధిలో నాలుగు సార్లు అమిత్ రావడమే ఇందుకు కారణం. ఒకవేళ కేసీఆర్ ముందస్తుకి వెళితే తెలంగాణలో అధికారంలోకి రావాలంటే హైదరాబాద్ ను గెలవాలి. మొన్న జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కమలం తన సత్తా చాటింది. కానీ ఈ బలం సరిపోదు. పైగా మినీ ఇండియా లాంటి హైదరాబాద్లో సెటిలర్ ఓటర్లు ఎక్కువ. పైగా కూకట్పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ వంటి స్థానాల్లో కమ్మ ఓటర్లున్నారు. వీరు గెలుపు ఓటములు ప్రభావితం చేయగలరు. పైగా జూనియర్ ఎంతో ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. అందుకే అమిత్ భేటీ అయ్యాడనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే జూనియర్ బీజేపీకి ప్రచారం చేసే అవకాశం ఉండదు. ఫీల్డ్ ప్రాపబులిటీస్ ను గమనిస్తే కనుక అమిత్ ఎన్ని విందులు ఇచ్చినా జూనియర్ కమలానికి ఉపయోగ పడే క్యారెక్టర్ కాదు. అతడి లయబిలిటీ ఎప్పటికైనా ఏపీనే! అయితే ప్రజలు కూడా సినిమాకు రాజకీయాలకు విభజన రేఖ గీస్తున్నారు. మరి ఈ స్థితిలో జూనియర్ రాజకీయాల్లోకి వచ్చి ఏం చేయాలి? ప్రస్తుతం అతడి వయసు 40 మాత్రమే. రాజకీయాలకి అవసరమైన రాటుదనం, అనుభవం ఇంకా రాలేదనే అర్థం.
ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ మీద సినిమా తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నా సరే బీజేపీ ఈ సినిమా నిర్మించదు. ఒకవేళ ఈ సినిమాలో నటించేందుకు జూనియర్ ను తీసుకోవాలి అనుకున్నా దానికి అమిత్ షా మధ్యవర్తిత్వం అవసరం లేదు. అయితే ఎన్టీఆర్ ని అమిత్ షా భోజనానికి మాత్రం పిలిచారని ఎవరు అనుకోవడం లేదు. ఇద్దరి మధ్య ఏకాంతంగా జరిగిన మీటింగ్ లో చాలా అంశాలు చర్చకు వచ్చాయని బిజెపి వర్గాలు అంటున్నాయి. వీటి పైన అటు అమిత్, ఇటు జూనియర్ నోరు మెదపడం లేదు. కానీ ఈ పొలిటికల్ ఫీస్ట్ ను మాత్రం బిజెపి నాయకులు ఎంజాయ్ చేస్తున్నారు. అది కూడా మునుగోడు ఎన్నికలకు ముందు.
ఓవరాల్ గా చూస్తే.. చుక్కాని లేని నావలా ఉన్న ఏపీ బీజేపీ బండికి జూనియర్ ఎన్టీఆర్ ను లాగాలని అమిత్ షా చూసినట్టున్నారు.కానీ జూనియర్ ఇప్పుడప్పుడే రాజకీయాల్లోకి రాదలుచుకోలేదు. అందుకే భవిష్యత్తులోనైనా ఒప్పుకుంటే ఏపీ బీజేపీ పగ్గాలు ఇచ్చే అవకాశాలు పరిశీలించాలని కోరినట్టు తెలుస్తోంది. కానీ తెలుగుదేశం, చంద్రబాబు ఉన్నంత కాలం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల బాటపట్టారు. పడితే గిడితే తన తాత పెట్టిన తెలుగుదేశాన్ని టేకోవర్ చేస్తారు తప్పితే బీజేపీలోకి వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ టీడీపీ కాదనుకుంటే ఇంకో పది పదిహేనేళ్ల వరకైనా బీజేపీ పగ్గాలు ఎన్టీఆర్ తీసుకోవచ్చు. కానీ అప్పటివరకూ ఈ అమిత్ షాలు, మోడీలు ఉండరు. సో ఈ భేటిలో ఏదో ఒక రాజకీయ ప్రయోజనం ఆశించి కలిశారు. కానీ జూనియర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల వాసనే గిట్టకుండా ఉన్నారు. భోజనం చేసి పోవడం తప్ప పెద్దగా ఇందులో అప్డేట్స్ ఏం ఉండవని తెలుస్తోంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: What happened in amit shah jr ntr meeting
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com