Viral Video : దట్టమైన అడవులకు.. విస్తారమైన జంతువులకు మధ్యప్రదేశ్ రాష్ట్రం పెట్టింది పేరు. ఇక్కడ ఉన్న జిల్లాలో దాదాపు అన్నీ అడవులకు సమీపంలోనే ఉంటాయి. ఇక కొన్ని గ్రామాలైతే అడవులకు దగ్గరగా ఉంటాయి. ఆ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన జన్మదినం సందర్భంగా ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతా లను మధ్యప్రదేశ్ లోని అటవీ ప్రాంతంలోనే వదిలిపెట్టారు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జీవవైవిధ్యం బాగుంటుంది. అక్కడి వాతావరణం క్రూర మృగాల సంచారానికి అనువుగా ఉంటుంది. అందువల్లే అక్కడ జంతువుల సంఖ్య అధికంగా ఉంటుంది. పులులు, చీతాలు, చిరుతపులులు అక్కడ ఎక్కువగా సంచరిస్తుంటాయి. అడవుల నుంచి గ్రామాల్లోకి వస్తుంటాయి. గ్రామాలలో పశువులపై దాడి చేసి చంపి తినేస్తుంటాయి. అక్కడి ప్రజలకు చిరుతపులుల అలికిడి తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉంటారు.. కొందరైతే తన పశువులను రక్షించుకోవడానికి రకరకాల చర్యలు చేపడుతుంటారు..
Also Read : సిల్వర్ జూబ్లీ సంబరం.. భార్యతో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన భర్త.. వైరల్ వీడియో
చిరుత పులులకు నీరు పెట్టాడు
సాధారణంగా చిరుతపులులు ఎదురుగా మనుషులు ఉన్నా.. జంతువులు ఉన్నా దూరంగా వెళ్లిపోతుంటాయి. వాటికి ఆకలి అనిపిస్తేనే దాడికి దిగుతాయి. అవి గుంపులుగా ఉన్నప్పుడు మాత్రం దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటాయి. అది వాటి సహజ లక్షణం కూడా. అయితే సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఓ వీడియోలో చిరుతపులులు గుంపులుగా ఉన్నాయి. ఒక చెట్టు కింద పడుకొని ఉన్నాయి. ఈలోపు ఒక వ్యక్తి ఓ క్యాన్ లో నీళ్లు తీసుకొని వచ్చాడు. వాటి దాహాన్ని గమనించినట్టున్నాడు.. ఒక చిన్న ప్లేట్ లో క్యాన్ లో ఉన్న నీళ్లను పోశాడు. ఆయీయే అని పిలవగానే అవి తోక ఊపుకుంటూ వచ్చాయి. ఆ ప్లేట్లో నీళ్లను తాగాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సీయోరా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వాస్తవానికి ఆ చిరుతపులుల మంద చూస్తే భయం వేయడం ఖాయం. అసలు వాటిని దూరం నుంచి చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది అన్ని చిరుతపులులు ఉన్నప్పటికీ కూడా.. అతడు ఏమాత్రం భయపడకుండా ప్లేట్లో నీళ్లు పోసి.. రమ్మని చెప్పడం.. అవి వచ్చి తాగడం ఇలా చకచకా జరిగిపోయాయి. సాధారణంగా పులులను చూస్తే ఎవరైనా భయపడతారు. కానీ ఆ వ్యక్తి ఎటువంటి భయం లేకుండా వాటికి నీళ్లు పోయడం సంచలనం కలిగిస్తోంది. అయితే ఆ పులులను అతడు పెంచుకుంటున్నాడా.. లేక అవి దాహంతో ఉండడం వల్ల అతడు పిలవగానే వచ్చాయా.. అనే ప్రశ్నలకు స్థానికులు తమదైన శైలిలో సమాధానాలు చెప్పారు..” చిరుతపులులు మా గ్రామాల్లోకి వస్తుంటాయి. ఇదేమి వింత కాదు. ఆశ్చర్యం అంతకన్నా కాదు. అవి మా పై దాడి చేయవు. అరుదైన సందర్భాల్లో మాత్రమే అవి దాడి చేస్తాయి. కాకపోతే మా రక్షణలో మేము ఉంటాం. జంతువులపై మాత్రం ఉపేక్షను ఏమాత్రం ప్రదర్శించవు. ఎండాకాలంలో అడవుల్లో నీరు దొరకదు. అప్పుడు అవి తమ దాహార్తి తీర్చుకోవడానికి గ్రామాల్లోకి వస్తుంటాయి. వాటి దుస్థితి చూడలేక మేము ఇలా నీరు పెడుతుంటామని” గ్రామస్తులు చెబుతున్నారు. మొత్తానికి చిరుతపులులకు నీరు పెట్టిన ఆ వ్యక్తి సోషల్ మీడియాలో స్టార్ అయిపోయాడు. అతని గురించే విపరీతమైన చర్చ నడుస్తోంది. అనేసి చిరుతపులులకు నీరు పట్టిన అతడు గొప్ప ధైర్యవంతుడని నెటిజన్లు పొగిడేస్తున్నారు.
Also Read : బౌలర్ బంతి వేస్తుండగా లైట్లు ఆఫ్.. వైరల్ వీడియో
View this post on Instagram