Viral Video : ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి.. అరుదైన వీడియోలను చూసే అవకాశం కలుగుతోంది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆ వీడియోలో.. ఓ ప్రాంతానికి చెందిన మహిళ వివాహం చేసుకుంది. ఆమె ధరించిన దుస్తులు.. నగల ప్రకారం చేసుకుంటే అది ఉత్తర భారతదేశం అని స్పష్టం అవుతోంది. వివాహం జరిగిన తర్వాత అప్పగింతల కార్యక్రమానికి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. వరుడు కారులో కూర్చొని ఉండగా.. వధువును ముస్తాబు చేసి అతనితో అత్తింటి వారి వద్దకు పంపించడానికి ఏర్పాట్లు చేశారు. కారులో వరుడు కూర్చొని ఉండగా.. అతనితో పంపించడానికి వధువును కుటుంబ సభ్యులు తీసుకెళ్తున్నారు. ఆ దృశ్యం చాలా బరువుగా ఉంది. వధువును పంపించుకుంటూ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వెక్కి వెక్కి ఏడుస్తూ వధువు కూడా చాలా భారమైన హృదయంతోనే బయలుదేరింది. కానీ ఇంతలోనే ఓ కుక్క ఆమెను అడ్డుకుంది.
Also Read :పెళ్లి మండపంలో పెళ్లి కూతురు చేసిన పని చూసి వరుడు షాక్.. వైరల్ వీడియో
ఆ కుక్కను ఆ వధువు చాలా రోజులపాటు నుంచి సాకుతోంది. దానికి అన్నం పెడుతోంది. పాలు పోస్తోంది. గుడ్లు కూడా తినిపిస్తోంది. దానికి ఏదైనా అనారోగ్యం సోకితే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్సలు కూడా చేయించింది. ఒకరకంగా చంటి బిడ్డ కంటే ఎక్కువగా దానిని సాకుతోంది. ఆ కుక్కకు కూడా ఆ వధువుపై విపరీతమైన ప్రేమను పెంచుకుంది. అందువల్లే ఆ కుక్క ఆ వధువు అత్తింటికి వెళుతుంటే తట్టుకోలేకపోయింది. వెంటనే ఆ వధువుకు అడ్డుపడింది. తనను విడిచి వెళ్ళొద్దంటూ ఆ కుక్క ఆమెను గట్టిగా ఆలింగనం చేసుకుంది. దీంతో ఆ వధువు కూడా గుండెలవిసిపోయేలాగా రోదించింది. చివరికి కుటుంబ సభ్యులు ఆ కుక్కను అత్యంత బలవంతంగా ఆమె నుంచి విడిపించారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. డబ్బుల కోసం.. ఆస్తుల కోసం మనుషుల మధ్య ప్రేమ తగ్గిపోతోంది. సాటి మనుషులను కిరాతకంగా చంపేసే దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అన్నం తిన్న పుణ్యానికి ఓ కుక్క విశ్వాసం చూపించింది.. తనకు తానే సాటి అని నిరూపించుకుంది. యజమానిపై అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించి.. తన జన్మకు సార్ధకత చేకూర్చుకుంది. అందువల్లే కుక్కలను విశ్వాసానికి ప్రతీకలుగా పేర్కొంటుంటారు. కుక్కలను గొప్ప జంతువులుగా అభివర్ణిస్తుంటారు. ప్రతి సందర్భంలోనూ కుక్కలు యజమానికి అనుకూలంగానే ఉంటాయి. ఎటువంటి ఆపద వచ్చినా వెంటనే తమ వంతుగా స్పందిస్తుంటాయి. చివరికి ప్రాణాలను కూడా లెక్కచేయకుండా యజమాని సేవలో తరిస్తుంటాయి. చివరికి యజమాని కన్నీరు పెట్టినా కూడా తట్టుకోలేరు. గుండెలు బరువెక్కే విధంగా రోదిస్తూ ఉంటాయి.