Viral Video : సోషల్ మీడియా పిచ్చి జనాలకు బాగా పెరిగిపోయింది. వైరల్ అవ్వాలనే కోరికతో జనాలు ఎంతటి సాహసాలు చేయడానికి అయినా వెనుకాడడం లేదు. కొందరు డ్యాన్స్ చేస్తారు, కొందరు ఫన్నీ వీడియోలు చేస్తారు, మరికొందరు సాహసాలు చేస్తారు. కానీ కాశ్మీర్‌కు చెందిన ఈ యువతి చేసిన పని మాత్రం అన్నింటినీ మించిపోయింది. ఆమె ఏకంగా ఒక ఎత్తైన చెట్టుపై ఎక్కి డ్యాన్స్ చేస్తూ రీల్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవ్వడంతో పాటు ఫన్నీ కామెంట్లు కూడా పెడుతున్నారు.
నేటి తరం సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రెండింగ్ పాటలకు డ్యాన్స్ చేయడం, లిప్-సింక్ చేయడం వంటి సాధారణ విషయాలు అందరూ చేస్తుంటారు. కానీ కాశ్మీర్‌కు చెందిన ఒక మహిళ మాత్రం వైరల్ అవ్వడానికి ఏకంగా ఒక అడుగు ముందుకేసింది. ఆమె చేసిన పని చూస్తే నిజంగా నోరెళ్లబెట్టాల్సిందే. ఒక ఎత్తైన చెట్టు ఎక్కి చిటారు కొమ్మన నిలబడి రీల్ చేస్తూ కనిపించిన ఈ మహిళ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఆమె చేసిన పనికి నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
ఉషా నాగవంశీ అనే ఈ కాశ్మీరీ మహిళ తన రీల్ వీడియోతో సోషల్ మీడియా ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఇది చాలా ప్రత్యేకమైనది మత్రమే కాదు.. ప్రమాదకరమైనది కూడా. వైరల్ అవుతున్న వీడియోలో వయలెట్ కలర్ చూడీదార్ ధరించిన ఉషా ‘ఇష్క్జాదే’ సినిమాలోని సూపర్ హిట్ పాట ‘ఝల్లా వాలా’కు ఎత్తైన చెట్టుపై ఎక్కి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. కొంచెం అటు ఇటు అయినా ఆమె చేతులు, కాళ్లు విరిగిపోయే ప్రమాదం ఉంది. కానీ ఉషా మాత్రం చెట్టు కొమ్మపై అద్భుతమైన బ్యాలెన్స్ చేసుకుంటూ డ్యాన్స్ చేసింది.
ఉషా ఈ వీడియోను ఏప్రిల్ 20న తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా @ushanagvanshi31లో షేర్ చేసింది. వారం రోజుల్లోనే ఈ వీడియోను 2.4 కోట్ల మందికి పైగా వీక్షించారు. 6 లక్షల మందికి పైగా లైక్ చేశారు. అంతేకాకుండా నెటిజన్లు పెద్ద సంఖ్యలో కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ “ఎవరూ కాపీ చేయలేని కంటెంట్ క్రియేట్ చేయాలి అంటే ఇదే” అంటూ కామెంట్ చేశాడు. మరొక యూజర్ “ఇక రెండో రీల్ నేరుగా కుతుబ్ మీనార్ పైన” అని అన్నాడు. ఇంకొక యూజర్ అయితే “దీదీని చూస్తే చావు కూడా భయపడుతుంది” అంటూ ఫన్నీ కామెంట్ పెట్టాడు.