Viral Video : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా చినాబ్ నదిపై నిర్మించిన ఐరన్ బ్రిడ్జి గుర్తింపు పొందింది. దీనిపై రైళ్లు ఇప్పటికే పరుగులు పెడుతున్నాయి. ఎత్తయిన కొండలు, లోయలు, గుహల గుండా ప్రయాణం సాగుతోంది. పర్యాటకులను ఆకరి‍్షంచేలా కేంద్రం జమ్మూ కశ్మీర్‌లోని కఠిన శీతల వాతావరణ పరిస్థితులను తట్టుకుకేలా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైతుల తయారు చేయించింది రైతు తొలి ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. కాత్రాలోని మాతా వైష్ణోదేవి రైల్వేస్టేషన్(Vishnodevi Railway station) నుంచి శ్రీనగర్‌కు ప్రయాణికులను తీసుకుని తొలి ప్రయాణం సాగించింది. మార్గం మధ్యలో చినాబ్ నదిపై నిర్మించిన ఎత్తయిన వంతెన మీదుగా పరుగులు పెట్టింది. దీనికి సంబంధించిన దృశ్యాని‍్న రైల్వే శాఖ విడుదల చేసింది. ఇది సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. రైతు ప్రయాణానికి సిద్ధమైన సమయంలో వైష్ణోదేవి రైల్వే స్టేషన్ భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగింది.
ఉష్ణ వ్యవస్థ ఏర్పాటు
కాత్రాలో రైలును ప్రధాని నరేంద్రమోదీ జెండా ఊపి ప్రారంభించారు. కాత్రా నుంచి శ్రీనగర్‌కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు సాగిస్తుంది. ఇప్పటికే నడుస్తున్న 36 వందే భారత్‌ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే జమ్మూ కశ్మీర్లో నడిచే వందే భారత్ రైలులో అదనపు ఫీచర్లు ఉన్నాయి. సున్నా డిగ్రీల అతి శీతల వాతావరణం తట్టుకునేలా నీరు, బయో టాయిలెట్లు గడ్డకట్టకుండా ఉండేలా అధునాతన ఉష్ణ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
నెట్వర్క్కనెక్ట్ సులభతరం..
కొత్త వందేభారత్ రైలులో వాక్యూమ్ వ్యవస్థకు వేడి గాలిని సరఫరా చేసి అడ్వాన్సడ్ ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. మంచు కురిసే సమయంలో లోకోపైలట్‌కు ముందు ఉన్న దృశ్యం స్పష్టంగా కనిపించే ఏర్పాట్లు ఉన్నాయి. దీని రాకతో కశ్మీర్ లోయలో రైల్వే అనుసంధానత మెరుగుపడి జమ్మూ కశ్మీర్‌ను భారత రైల్వే నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడం కూడా సులభమని అధికారులు పేర్కొంటున్నారు.
తొలిసారిగా కేబుల్ స్టేయిడ్ రైలు వంతెన నిర్మాణం
ఇదిలా ఉంటే.. జమ్ముకశ్మీర్‌లో చాలా లోయలు ఉంటాయి. దీంతో గతంలో రైలే‍్వ కనెక్టివిటీ అంతగా లేదు. దీంతో కేం6దం ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టును పూర్తి చేసింది. ఇందులో భాగంగా ఇంజినీరింగ్ అద్భుతమైన దేశంలో తొలిసారిగా కేబుల్ స్టేయిడ్ రైలు వంతెన- అంజి ఖాడ్‌ను నిర్మించారు. ఈ వంతెన నదీ గర్భానికి 331 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రపంచంలోనే అత్యంత రివర్‌బెడ్‌కు 359 మీటర్ల ఎత్తులో ఉనన వంతెనను చినాబ్ నదిపై నిర్మించారు. ఈ చీనాబ్ వంతెనపై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణించింది.
History Created Vande Bharat Crossing World’s Highest Rail Bridge aka The Chenab Bridge for the first time ever #IndianRailways #VandeBharat pic.twitter.com/Zt2C8we1kx
— Trains of India (@trainwalebhaiya) January 25, 2025