Deputy CM Pawan Kalyan
Pawan Kalyan : సోషల్ మీడియా లో ట్విట్టర్ అకౌంట్ తన వ్యక్తిగత అవసరాలకు, సినిమాల అప్డేట్స్ కి కాకుండా కేవలం జనాల్లో చైతన్యం కలిగించడం కోసం ఉపయోగించే ఏకైక ఇండియన్ సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే సామాన్యమైన అభిమానులకు అర్థం కాదు. మొత్తం రాజకీయాలకు సంబంధించినవే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆయన ట్వీట్స్ రికార్డు స్థాయి లైక్స్, రీట్వీట్స్, కామెంట్స్ వస్తుంటాయి. అయితే కాసేపటి క్రితమే ఆయన ట్విట్టర్ లో అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ గురించి చేసిన ఒక కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. ఇది నిజంగా పవన్ కళ్యాణ్ వేసిన ట్వీట్ యేనా?, లేకపోతే ఎవరైనా ఆయన అకౌంట్ ని హ్యాక్ చేసారా అనే అనుమానాలు అభిమానుల్లో కలిగాయి. ఎందుకంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా ఇలాంటి ట్వీట్ వేయలేదు.
ఇంతకీ ఆయన ట్వీట్ లో ఏముందంటే ‘అమెజాన్ గిఫ్ట్ కార్డుని ఉపయోగించే వినియోగదారులు లేవనెత్తిన కొన్ని ఫిర్యాదు నా దృష్టికి కొంతమంది తీసుకొచ్చారు. అమెజాన్ గిఫ్ట్ కార్డు కాల పరిమితి ముగిసిన తర్వాత, చాలా మందికి అకౌంట్ లో ఉన్న బ్యాలన్స్ డబ్బులు కూడా పోతున్నాయి. ఇది నా ఆఫీస్ లో కూడా చాలా మందికి జరిగింది. వినియోగదారులు కష్టపడి సంపాదించిన డబ్బులు ఇలా అదృశ్యం అవ్వడం బాధాకరం. కస్టమర్ కేర్ ని సంప్రదించినా ఉపయోగం లేకుండా పోతుంది. 295 మిల్లియన్లకు పైగా ఇండియన్స్ ఈ-కామర్స్ ఫ్లాట్ ఫారమ్ లను చాలా చురుగ్గా ఉపయోగిస్తున్నారు, ఇప్పటి వరకు 1 బిలియన్ కి పైగా గిఫ్ట్ కార్డులు ఇండియాలోనే అమెజాన్ యూజర్లు కొనుగోలు చేసారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం, అన్ని PPI లు తప్పనిసరిగా కనీసం ఒక సంవత్సరం చెల్లుబాటును కలిగి ఉండాలి. ఒక సంవత్సరం పాటు ఒకవేళ అకౌంట్ ఇన్ యాక్టీవ్ గా ఉంటే, ముందస్తు నోటీసు ద్వారా మాత్రమే ఆ ఖాతాని డీ యాక్టీవ్ చేయాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.
అనవసరమైన నష్టాల నుండి వినియోగదారులను రక్షించడానికి ఈ కామర్స్ వెబ్సైట్స్ పారదర్శకత, న్యాయబడ్డాను కలిగించేలా వ్యవహరించాలి అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. ముందుగా అందరూ ఇది పవన్ కళ్యాణ్ అకౌంట్ హ్యాక్ అవ్వడం వల్ల ఇలాంటి ట్వీట్ పడింది. వాస్తవానికి హ్యాక్ కి గురైనప్పుడు మాత్రమే ఇలాంటి ట్వీట్స్ సదరు అకౌంట్స్ నుండి పడుతుంటాయి. అయితే ఇది నిజంగానే పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చిన సమస్య. స్వయంగా ఆయన ఆఫీస్ స్టాఫ్ లోనే ఇలాంటివి జరగడంతో అందరి తరుపున ఆయన ఇలాంటి ట్వీట్ వేసాడు.
Of late, few complaints raised by amazon gift card users have been brought to my attention. It is indeed concerning to realise that the expired gift card balance of amazon users would be lost into dormant accounts. Even my office experienced this issue of lost balances from… pic.twitter.com/V8m3SIb0R9
— Pawan Kalyan (@PawanKalyan) January 25, 2025
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Pawan kalyans sensational tweet on amazon gift cards fans comment saying his twitter account has been hacked
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com