Pushpa 2 Movie : గత ఏడాది డిసెంబర్ నెలలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ‘పుష్ప 2′(Pushpa 2 Movie) చిత్రం ఇండియా లోనే ఇండస్ట్రీ హిట్ గా నిల్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపుగా 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి ఓటీటీ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గానే టీవీ టెలికాస్ట్ లో కూడా బంపర్ రెస్పాన్స్ వచ్చింది. మరోసారి అల్లు అర్జున్ టీఆర్ఫీ రేటింగ్స్ లో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పి ఉండొచ్చని అంటున్నారు ట్రేడ్ పండితులు. వచ్చే వారం ఎంత టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి అనేది తెలియనుంది. అయితే ప్రతీ సినిమాకు లాగానే, ఈ సినిమాకు కూడా VFX షాట్స్ చాలానే ఉన్నాయి. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నేడు మూవీ టీం యూట్యూబ్ లో విడుదల చేసింది.
Also Read : ఈ ఏడాది ‘బిగ్ బాస్’ షో లేనట్టేనా..? నిరాశలో ఫ్యాన్స్..కారణం ఏంటంటే!
ఈ వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ ఫైట్ జపాన్ లో ఉంటుంది కదా, అది జపాన్ కి వెళ్లి తీసి ఉంటారని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే సెట్స్ లో తీసారని నేడే తెలిసింది. అదే విధంగా సముద్రం లో ఎర్ర దుంగలను తరలించే సన్నివేశాలన్నీ కూడా VFX ద్వారా తీసినవే. అదే విధంగా అడవుల్లో చెట్ల మీద నుండి దుంగలు తీయడం,మాల్దీవ్స్ లో డీలింగ్ చేయడం వంటివి అన్నీ ఇక్కడే సెట్స్ వేసి తీశారు. ఎక్కడా కూడా ఇవంతా గ్రాఫిక్స్ అని మనకి అనిపించదు. చాలా సహజత్వానికి దగ్గరగా ఈ సన్నివేశాలన్నీ ఉన్నాయి. ఇది దర్శకుడి ప్రతిభకు తార్కాణం అని చెప్పొచ్చు. బాహుబలి సిరీస్ కి ఉపయోగించిన VFX షాట్స్ కంటే, ఈ సినిమాకు ఉపయోగించిన VFX షాట్స్ ఎక్కువని అంటున్నారు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత సోషల్ మీడియా ట్రోల్స్ కూడా మొదలయ్యాయి.
సినిమా మొత్తం VFX తోనే కవర్ చేసారు కదరా, ఇంత మోసమా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఇలాంటి ట్రోల్స్ సర్వసాధారణమే. కల్కి VFX వీడియో వచ్చినప్పుడు కూడా నెటిజెన్స్ ఇలాంటి ట్రోల్స్ గట్టిగానే వేశారు. సోషల్ మీడియా ని ఊపేస్తున్న ఈ వీడియో ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఇకపోతే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ అట్లీ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు, ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో ని గ్రాండ్ గా విడుదల చేసారు మేకర్స్. ఈ వీడియో ని చూస్తున్నంతసేపు హాలీవుడ్ సినిమాని చూసిన అనుభూతి కలుగుతుంది. కేవలం ప్రకటన విడియోతోనే ఈ రేంజ్ సెన్సేషన్ సృష్టిస్తే, ఇక రాబోయే రోజులు ఈ కాంబినేషన్ చేసే వండర్స్ ఎలా ఉంటాయో చూడాలి.