Heroine Misbehavior Video: ఈమధ్య కాలం లో కొంతమంది సినీ సెలబ్రిటీలు తమకు కావాల్సిన అవకాశాలు రాకపోవడం తో ఎలా అయినా ఫేమస్ అవ్వాలి, మళ్ళీ జనాల నోర్లలో బాగా నానాలి, అటెన్షన్ సంపాదించుకోవాలి అనే ఉద్దేశ్యంతో ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగ స్వేచ్ఛ ఇచ్చింది కదా అని ఏది పడితే అది చేస్తూ పబ్లిక్ లో గోల చేస్తున్నారు. కనీసం ఇలా చేస్తే అయినా జనాల దృష్టిలో పడుతాము, ఒకవేళ బిగ్ బాస్ రియాలిటీ షోకి ఇలాంటివి చేయడం వల్ల ఎంపిక అవుతాము అనే ఉద్దేశ్యం వీళ్లకు ఉండిఉండొచ్చు. అందులో భాగంగానే ఈమధ్య కాలం లో కల్పిక గణేష్(Kalpika Ganesh) అనే క్యారక్టర్ ఆర్టిస్ట్ ఎదో ఒక గొడవతో పబ్లిక్ లో హంగామా సృష్టిస్తూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తుంది. గతం లో ఈమె పబ్ సిబ్బంది తో పడిన గొడవ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
నాకు కాంట్రవర్సి కావాలి, అందుకే ఇలా చేస్తున్నాను అంటూ అప్పట్లో ఆమె ఆ వీడియోలో పబ్లిక్ గా ఒప్పుకుంది కూడా. ఆ తర్వాత ఆమె ఇచ్చిన అనేక ఇంటర్వ్యూస్ లో యాంకర్లతో గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి. పబ్ గొడవ జరిగి నెల రోజులు కూడా కాలేదు, ఇంతలోపే ఆమె నిన్న ఒక రిసార్ట్ స్టాఫ్ తో గొడవపడుతూ ఒక వీడియో ని అప్లోడ్ చేసింది. ఈ వీడియో లో కల్పిక గణేష్ చాలా దరిద్రమైన బాషని ఉపయోగిస్తూ రిసార్ట్ స్టాఫ్ పై నోరు పారేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అసలేంటి ఈ అమ్మాయి ఇలా ప్రవర్తిస్తుంది. తెలుగు అమ్మాయి అయ్యుండి తెలుగోళ్ల పరువు తీస్తుంది, ఇలా చేస్తే ఆమెకు బిగ్ బాస్ లో అవకాశం వస్తుందని అనుకుంటుందా? అని ఈ వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ‘వార్ 2’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ నిలిపివేత..కారణం ఏమిటంటే!
ఆ తర్వాత ఆమె దానికి వివరణ ఇస్తూ తాను సిగరెట్స్ అడిగితే రిసార్ట్ స్టాఫ్ చాలా దురుసుగా ప్రవర్తించారని, అందుకే నేను వీడియో ని షూట్ చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేశాను అంటూ చెప్పుకొచ్చింది. కల్పిక గణేష్ 2009 వ సంవత్సరం లో ‘ప్రయాణం’ అనే చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా తర్వాత ఆమె వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. ఒక్క చిత్రం లో కూడా హీరోయిన్ రోల్ రాలేదు. అన్నిట్లో సపోర్టింగ్ రోల్స్ తోనే ఆమె సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2023 వ సంవత్సరం వరకు యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ వచ్చిన కల్పిక, గత రెండేళ్ల నుండి సినిమా అవకాశాలు లేక ఖాళీగా ఉంటుంది. అందుకే ఆమె మళ్ళీ అందరి దృష్టిలో పడేందుకు ఇలా ప్రవర్తిస్తుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరోసారి వివాదం సృష్టించిన సినీ నటి కల్పిక
హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ – కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో హంగామా సృష్టించిన నటి కల్పిక
మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్యాబ్‌లో ఒంటరిగా రిసార్ట్‌కు వచ్చి, రిసెప్షన్లో అడుగు పెట్టగానే మేనేజర్ కృష్ణపై దురుసుగా… https://t.co/BBMRRrTw8Z pic.twitter.com/u3dFzz72Ym
— Telugu Scribe (@TeluguScribe) July 29, 2025