Bihar Viral House: గ్రామాలలో అంటే విస్తారమైన గృహాలు నిర్మించుకోవచ్చు. విలాసవంతమైన భవనాలను ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ పట్టణాలు, నగరాలలో అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ భూముల ధర చాలా ఖరీదు. శ్రీమంతులకు, ఆర్థిక స్తోమత అధికంగా ఉన్న వారికి తప్ప మిగతా వారికి భారీగా గృహాలు నిర్మించుకోవడం సాధ్యం కాదు. పైగా నేటి రోజుల్లో విలాసవంతంగా భవనాలను నిర్మించుకోవడం అసలు వీలు కాదు. అయితే పట్టణాలు, నగరాలలో భూముల ధరలు మండిపోతున్న నేపథ్యంలో.. ఓ వ్యక్తి నిర్మించిన భవనం సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. దానికి సంబంధించిన వీడియో చర్చకు కారణమవుతోంది.
Also Read: సేవకు బహుమానం యూట్యూబ్ ఛానల్ ఉదాహరణగా!
సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆ వీడియోలో విభిన్నమైన గోడలతో నిర్మించిన ఓ ఇల్లు కనిపిస్తోంది. ఆ ఇంటికి నిర్మించిన గోడలు విచిత్రంగా ఉన్నాయి. సన్నగా ఎత్తుగా ఉన్న ఆ గోడలను దూరం నుంచి చూస్తుంటే ఇల్లు అనే భావన కలిగించడం లేదు. పైగా ఆ నిర్మాణం అక్కడ ఎలా, ఎందుకు చేపట్టారో అర్థం కావడం లేదు. అయితే కాస్త ముందుకెళ్లి చూస్తే అది ఒక ఇల్లు అని అర్థమవుతోంది. ఇది బీహార్ రాష్ట్రంలోని కగాడియా జిల్లాలో ఉంది. బీహార్ రాష్ట్రంలోని స్థానిక మీడియా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు అంత తక్కువ వెడల్పులో ఇల్లు ఎందుకు నిర్మించారని స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే ఈ జిల్లా కేంద్రంలో ఇళ్ల స్థలాల ధరలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఇల్లు ఇలా నిర్మించి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే ఇంకా ఆ ఇంటి నిర్మాణం తుది మెరుగుల్లో ఉంది. అయితే అంతటి తక్కువ కొలతల్లో మనుషులు ఎలా నివాసం ఉంటారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
సాధారణంగా 120 గజాల్లో నిర్మించుకునే ఇల్లే ఒకరకంగా ఇరుకుగా ఉంటుంది. అలాంటిది కనీసం 20 గజాలు కూడా లేని స్థలంలో ఇల్లు నిర్మించారు. అయితే ఇందులో ఎలా నివాసం ఉంటారు. అసలు అందులోకి ఎలా వెళ్తారు.. మనుషులకా? జంతువులకా? ఈ ఇంటిని ఎవరికోసం నిర్మించారు అనేది అర్థం కావడం లేదు. అంతటి ఇరుకు ప్రదేశంలో నివాసం ఉండడం ఎలా సాధ్యమవుతుందని” నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.. ఇంతటి ఇరుకు గదిలో ఏదైనా ఆసాంఘిక కార్యకలాపం నిర్వహిస్తారేమోనని ఓ నెటిజన్ తన సందేహాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఇంతటి చర్చ జరుగుతున్నప్పటికీ.. ఇంటి నిర్మాణానికి సంబంధించిన అసలు విషయం మాత్రం వెలుగులోకి రాలేదు.
बिहार के खगड़िया में गजब का अजूबा घर बना दिया है इसमें आदमी कैसे रहेगा pic.twitter.com/OaYrOnZcwA
— छपरा जिला (@ChapraZila) July 1, 2025
అయితే ఇటీవల కాలంలో తక్కువ స్థలంలో గృహాలను నిర్మించుకునే కల్చర్ పెరిగిపోతోంది. ఇందులో భాగంగానే ఈ గృహాన్ని నిర్మించారని తెలుస్తోంది. ఇటువంటి గృహం వల్ల నివాసం ఉండడానికి ఉపయోగం లేకపోయినప్పటికీ.. కమర్షియల్ గా రెంట్ కు ఇచ్చే అవకాశం లేక పోలేదని స్థానికులు అంటున్నారు. అందువల్లే ఇంతటి తక్కువ విస్తీర్ణంలో ఇల్లు నిర్మించారని చెబుతున్నారు.