Viral Video : ఈ భూమ్మీద మనుషుల కంటే ముందు నుంచి జంతువులు మనుగడ సాగిస్తున్నాయి. కొన్ని సాధు జీవులు మనతో కలిసే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వన్యప్రాణులు కూడా మనుషులతో స్నేహం చేస్తాయి. ప్రకృతిలో ఎన్నో జంతువుల రకాలున్నాయి. మానవుడికి ఉపయోగపడేవి హాని కలిగించేవి ఉన్నాయి. అలాగే వేలకొద్ది రకాల పక్షులు కూడా ఉన్నాయి. కొన్ని సార్లు పక్షులు , జంతువులు చేసే పనులు చూస్తుంటే ఎంతో ముచ్చటగా అనిపిస్తుంటుంది. కచ్చితంగా గమనించాలి కానీ ప్రకృతిలో ఉన్నంతా ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడ ఉండదు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే ప్రకృతి ఎన్నో కొత్త విషయాలను నేర్పిస్తుంది. అంతేకాదు మనల్ని చిన్నపిల్లల్లా కూడా నవ్విస్తుంటుంది. ఇక ప్రకృతిలో భాగమైన పక్షులు, జంతువులు చేసే చేష్టలు భలే థ్రిలింగ్ అనుభూతిని కలిగిస్తుంటాయి.
కొన్నిసార్లు జంతువులు చేసే పనులు చూస్తుంటే ఆశ్చర్యం కలుగకమానదు. అచ్చం మనుషుల లాగా ప్రవర్తిస్తుంటాయి. ఇక మనుషుల మాదిరిగానే వాటి పిల్లలపై అవి చూపించే ఎమోషన్స్.. మనతో ప్రవర్తించే తీరు చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. కొన్ని జంతువులు చేసే అల్లరి పనులు చూస్తే సరదాగా అనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో భయాన్ని కూడా కొన్ని జంతువులు కలిగిస్తాయి. ఈ క్రమంలో తాజాగా జంతువులు మనుషుల వలె నడుస్తున్న ఓ వీడియో చూస్తే భలే థ్రిల్లింగుగా అనిపిస్తుంది. జంతువులు మనుషుల్లాగా నడవంటమేంటి అనే సందేహం కచ్చితంగా వచ్చే ఉంటుంది.
ప్రస్తుతం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మయం అయిపోయింది.. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే టాపిక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఇదే ప్రపంచాన్ని శాసిస్తోంది. ఏఐ ద్వారా వింతలు వినోదాలు సృష్టిస్తున్నారు. 20 ఏళ్ల వయసు వారిని 80 ఏళ్ల ముసలి వాళ్లుగా, చనిపోయిన ప్రముఖ నాయకులు కుంభమేళాలో స్నానం చేస్తున్నట్లు, బిలియనీర్లు కూడా మురికి వాడల్లో బతుకుతున్నట్లు క్రియేట్ చేస్తున్నారు. ఇది నిజమేనేమో అన్నట్లు ఉంటున్నాయి క్రియేషన్లు. సోషల్ మీడియాలో వీటిని పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. అలాంటి వీడియోనే ఇప్పుడు మరొకటి వెలుగులోకి వచ్చింది.
ఈ సారి జంతువులు, పక్షులు మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేశారు. ఓ బీచ్ వద్ద ఆవు, ఏనుగు, ఖడ్గమృగం, సింహం, జిరాఫీ, జీబ్రా, పాము వంటి జంతువులు రెండు కాళ్లతో నడుస్తున్నట్లు ఓ వీడియోను క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ ఏఐ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆశ్చర్యకరమైన ఆ వీడియోను చూసేయండి
If Animals could walk like human pic.twitter.com/lL9vSI5ZPq
— Shah Rukh Khan (@imsrkmp) February 13, 2025