Viral Video: పోలీస్ స్టేషన్లో పాటకు స్టెప్పులు ఇస్తే కాంగ్రెస్ నేత.. వీడియో దుమారం

గబ్బర్‌సింగ్‌ సినిమాల్లో పవన్‌ కళ్యాణ్‌ రౌడీలతో అంత్యాక్షరి ఆడిస్తారు, పాటలు పాడిస్తారు. ఇది ఆ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. నవ్వులు పూయించింది.

Written By: Raj Shekar, Updated On : April 15, 2024 3:35 pm

ZPTC Husband Dance at Police Station

Follow us on

Viral Video: అధికారం ఉంటే నేతల తీరే మారుతుంది. మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకులు పోలీసులను తమ సొంత కార్యకర్తల్లా వాడుకున్నారు. ఒక సమావేశంలో అయితే వంట గిన్నెలు కూడా మోయించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో కేసుల పాలైన కాంగ్రెస్‌ నేతలు పోలీస్‌ స్టేషన్‌ అంటేనే భయపడ్డారు. ఇక ఇప్పుడు అధికారం ఉండడంతో పోలీస్‌ స్టేషన్‌లోనే చిందులు వేస్తున్నారు.

మహదేవాపూర్‌ ఠాణాలో..
గబ్బర్‌సింగ్‌ సినిమాల్లో పవన్‌ కళ్యాణ్‌ రౌడీలతో అంత్యాక్షరి ఆడిస్తారు, పాటలు పాడిస్తారు. ఇది ఆ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. నవ్వులు పూయించింది. అలాంటి సీనే భూపాలపల్లి జిల్లా మహదేవాపూర్‌లో రిపీట్‌ అయింది. అయితే ఇక్కడ ఎస్సై అలా చేయించలేదు. మహదేవాపూర్‌ జెడ్పీటీసీ భర్త, కాంగ్రెస్‌ నాయకుడు అక్కడి పోలీస్‌ స్టేసన్‌లో స్వచ్ఛందంగా డ్యాన్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నేనున్నాను సినిమాలో నీ కోసం.. నీకోసం.. అంటూ సాగే పాటుకు హీరో నాగుర్జునలా స్టెప్పులేశాడు. పోలీసులే ఈ పాట పెట్టి జెడ్పీటీసీ భర్తతో స్టెప్పులు వేయించడమే కాకుండా వీడియో తీసినట్లు తెలుస్తోంది.

తీవ్ర విమర్శలు..
ఠాణాలో కాంగ్రెస్‌ నాయకుడు తమ ఇంట్లో వేసినట్లుగా పాటలకు స్టెప్పులు వేయడం, పోలీసులు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. అటు కాంగ్రెస్‌ నేత, ఇటు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పోలీస్‌ స్టేషనా లేక డ్యాన్స్‌ ఇనిస్టిట్యూటా అని ప్రశ్నిస్తున్నారు.