Viral Video
Viral Video : 17 సంవత్సరాల క్రితం విడుదలైన పరుగు సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. చాలామందికి కనెక్ట్ అయింది కూడా. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి చర్చ ఎందుకంటే.. తమిళనాడు రాష్ట్రంలో అటువంటి సంఘటన జరిగింది కాబట్టి.. తమిళనాడు రాష్ట్రంలో ఓ ప్రాంతంలో ప్రేమించిన వాడి వెంట కూతురు వెళ్ళిపోతుంటే… ఆ కూతురి మీద ప్రేమ చంపుకోలేక.. ఆమె మీద వాత్సాల్యాన్ని వదులుకోలేక ఆ తండ్రి అలానే పరుగులు తీశాడు. దానికి ఆ కూతురు..” నాకు అతడు అంటేనే ఇష్టం. అతనితో ఉండడం అంటేనే ఇష్టం. నా ఇష్టపూర్తిగానే అతడితో నేను వెళ్ళిపోతున్నాను. మధ్యలో నా వెంట ఎందుకు పడుతున్నారు.. నా ఇష్టానికి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నారు.. నాకు చాలా ఇబ్బందిగా ఉంది” అంటూ ఆ కూతురు అనడంతో తండ్రి ఒకసారిగా షాక్ కు గురయ్యాడు. అంతేకాదు కూతురు చేస్తున్న పనిని చూసి గుండె బరువెక్కి వెక్కివెక్కి ఏడ్చాడు.. ఈ దృశ్యం సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తోంది. అంతేకాదు ఆ కూతురు చేసిన పని పట్ల నెటిజన్ల నుంచి ఆగ్రహం రావడానికి కారణమవుతోంది.
Also Read: ప్రపంచంలో అత్యుత్తమ భర్త ఇతడే: వైరల్ వీడియో
యువతరం వింత పోకడ
ఒక వయసుకు వచ్చిన తర్వాత ఎవరిలోనైనా ప్రేమ కలగడం సర్వసాధారణం. దానిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రేమ వేరు.. పెళ్లి చేసుకున్న తర్వాత జీవితం వేరు.. ప్రేమించుకోవడానికి ఇద్దరు మనుషులు ఉంటే సరిపోతుంది. కానీ పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి. వారి ఆమోదం కావాలి. కానీ ఈ తరం యువతీ యువకులు అక్కడ దాక ఆగడం లేదు. ప్రేమించిన తర్వాత.. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్లి పోతున్నారు. కనీసం వారిని లెక్కలోకి కూడా తీసుకోవడం లేదు.. కని.. పెంచి.. విద్యాబుద్ధులు నేర్పించి.. ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను పిల్లలు కాదనుకోవడం.. ప్రేమ పేరుతో ఎక్కడికో వెళ్లిపోవడం.. ఇటీవల కాలంలో ఈ తరహా సంఘటనలు పెరిగిపోయాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే చాలావరకు సంసారాలు కుప్పకూలిపోతున్నాయి. వయసు వేడిలో వెళ్లిపోయిన యువతీ యువకులు.. మళ్లీ మోసపోయామని తల్లిదండ్రుల వద్దకు వస్తున్నారు. తమిళనాడులో జరిగిన సంఘటన పరుగు సినిమాను గుర్తు చేయగా.. ఆ యువతీ చేసిన పనిని నెటిజన్లు తప్పు పడుతున్నారు..” తండ్రి అంతగనం బతిమిలాడుతున్నప్పటికీ ఆ కూతురి మనసు కరగలేదు. నిన్న గాక మొన్న పరిచయమైన వ్యక్తితో వెళ్లిపోవడానికి సిద్ధమైంది. తండ్రిని మాత్రం కాదనుకుంటున్నది. ఇలాంటి యువతి అతడి కూతురైనందుకు సిగ్గనిపిస్తోంది. తన కూతురు అంతగా వద్దనుకుంటున్నప్పటికీ ఆ తండ్రి ఎంతగా బాధపడుతున్నాడో.. చూస్తుంటేనే గుండె బరువెక్కుతోందని” నెటిజన్లు వాపోతున్నారు.
Also Read : దండం రా దూత.. డబ్బులు ఇలా కూడా లెక్క పెడతారా? వైరల్ వీడియో
పరుగు సినిమాలో దృశ్యం.. తమిళనాడు లో ప్రత్యక్షం!
కన్న కూతురు ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతుంటే వెళ్ళొదని ప్రద్యేయ పడుతున్న తండ్రి.. విడియో వైరల్#TamilNadu #Daughters #UANow #Parents pic.twitter.com/fzv51crOnO
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) March 22, 2025
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Viral video the father is worried that his daughter will leave with the young man she loves
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com