https://oktelugu.com/

Viral video : విందు భోజనాలు అంటుంటాం కదా.. ఇలా పెట్టడంలో.. వీరి తర్వాతే ఎవరైనా.. వైరల్ వీడియో

Viral video : ఇటీవల కాలంలో విందులు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. చిన్నపాటి వేడుకను సైతం భారీగా నిర్వహిస్తున్నారు. అందులో వెజ్ కంటే నాన్ వెజ్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 13, 2025 / 12:11 PM IST
    Viral video

    Viral video

    Follow us on

    Viral video : ఇటీవల కాలంలో విందులు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. చిన్నపాటి వేడుకను సైతం భారీగా నిర్వహిస్తున్నారు. అందులో వెజ్ కంటే నాన్ వెజ్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక నాన్ వెజ్ ఉందంటే కచ్చితంగా మందు ఉండాల్సిందే.. పైగా మందు లేకపోతే ఆ విందుకు అర్థమే ఉండదు. అయితే కొన్ని ప్రాంతాల్లో విందులో మందు తాగడం అనేది పరిపాటి. అలా చేయకపోతే తేడా వచ్చేస్తుంది.. మాటా మాటా పెరిగి విషయం చాలా దూరం వెళుతుంది. అందువల్లే విందులో ముక్కలు.. దానికి తగ్గట్టుగా మందు గ్లాసులు ఉండేలా చూసుకుంటున్నారు.

    Also Read : 9 ఏళ్లకే ప్రెగ్నెంట్ అయిన బాలిక.. ఇదెక్కడి విడ్డూరం అండీ బాబు!

    ఏకంగా ఫుల్ బాటిల్స్ అందించారు

    సాధారణంగా వేడుకల్లో.. ఇతర ఫంక్షన్లలో మందు తాగడం అనేది కామన్ గా మారిపోయింది. ఇలాంటప్పుడు వచ్చిన వారికి బీర్ లేదా దాని తగ్గట్టుగా మద్యాన్ని పోస్తుంటారు. కానీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో ప్రకారం.. ఒక కుటుంబంలో వేడుక జరిగింది. ఆ వేడుకకు భారీగా బంధువులు వచ్చారు. వచ్చిన బంధువులకు ముందుగా భోజనాలు వడ్డించకుండా.. ఒక్కో బంధువుకు ఫుల్ బాటిల్ అందించడం మొదలుపెట్టారు. అది కూడా కాస్ట్లీ బ్రాండ్ మందు అందివ్వడం ప్రారంభించారు. అలా ఫుల్ బాటిల్ తీసుకున్న అతిధులు లో లోపల సంబరపడ్డారు.. ఎందుకంటే ముందు మందు పోస్తున్నారని.. వీళ్లది ఎంత దయార్ద్ర హృదయమో అనుకుంటూ లోలోపల వ్యాఖ్యానించుకుంటున్నారు.. ఫుల్ బాటిల్స్ ఇచ్చిన తర్వాత.. మటన్, చికెన్, తలకాయ కూర, బోటి ఫ్రై వడ్డించారు.. ఆ తర్వాత చికెన్ బిర్యాని, మటన్ కర్రీ, తలకాయ కర్రీ, బోటి ఫ్రై వేశారు.. చివర్లో సాంబార్, గడ్డ పెరుగు, ఐస్ క్రీం సర్వ్ చేశారు. మొత్తంగా వచ్చిన అతిథులను అద్భుతంగా చూసుకున్నారు.. మీ రాక.. మాకు ఎంతో సంతోషం కలిగించిందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఖరీదైన బహుమతులను అతిధులకు అందించారు. చివర్లో కిల్లి ఇచ్చి ఆశ్చర్య చకితులను చేశారు. అయితే అదే వేడుకకు హాజరైన కొంతమంది ఈ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలలో పోస్ట్ చేశారు.. ఇది ఇప్పటికే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. అంతకుమించిన స్థాయిలో కామెంట్లను దక్కించుకుంది. ఇన్ స్టా గ్రామ్ లో క్రేజీ రీల్స్ అనే ఐడి నుంచి ఈ వీడియో పోస్ట్ అయింది. ఈ వీడియో ను చూసిన నెటిజన్లు.. ఆ ఫంక్షన్ ఎక్కడ జరిగింది.. ఎవరు చేశారు? చిరునామా ఎక్కడ? అనే వివరాలను కనుక్కొనే పనిలో పడ్డారు. అయితే ఈ విందుకు భారీగానే ఖర్చయిందట. మద్యానికి లక్షల దాకా వెచ్చించారని తెలుస్తోంది.

    Also Read : సినీ జంటకు మించి.. దువ్వాడ శ్రీనివాస్, మాధురీల వీడియోలు చూస్తే మైండ్ బ్లాక్