Viral news
Viral news : మనుషులైతే పనిచేసే ఆహారాన్ని సంపాదించుకుంటారు. వారికి ఆకలి సమయం తెలుసు కాబట్టి ఆ కాలానికి ఇంత వండుకుంటారు. కడుపులో ఇంత పడేస్తారు. అదే జంతువులకైతే.. స్వయంగా సంపాదించుకోవాలి. ఇక దట్టమైన అడవుల్లో ఉండే జంతువులు అయితే .. ఆహార అన్వేషణ సాగించాలి. ఆ సమయానికి ఆహారం దొరికితే సరి.. లేకపోతే ఆకలి బాధ తప్పదు. అందువల్లే జంతువులు ఆహారం ఎక్కువగా లభించే ప్రాంతాల్లోనే నివసిస్తుంటాయి. నీరు మెండు గా ఉన్న ప్రాంతాల్లోనే సంచరిస్తుంటాయి. ఇక సాధు జంతువులు అయితే పండ్లు, ఫలాలు అధికంగా ఉన్నచోటే శాశ్వత ఆవాసాలు ఏర్పరచుకుంటాయి. పక్కనే నీరు ఉంటే ఇక వాటికి పండగే పండుగ. ఇక జంతువులకు ఆకలి వేసినప్పుడు వెంటనే ఆహారం పెడితే అవి తల ఊపుకుంటూ తింటాయి. చెప్పినట్టు వింటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
Also Read : అది జుట్టా.. అట్లువేసే పేనమా.. అలా ఎలా చేశార్రా?
బుల్లి ఏనుగు పిల్ల భలే తిన్నది..
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. అటవీ అధికారుల సంరక్షణలో ఉన్న బుల్లి ఏనుగు పిల్ల చేసిన సందడి సంచలనం సృష్టిస్తోంది. బుల్లి ఏనుగు పిల్లకు కేర్ టేకర్ ఆహారం తినిపించాడు. సాధారణంగా బుల్లి ఏనుగు పిల్లలు ఆహారం తినిపించేటప్పుడు మారం చేస్తుంటాయి. కాకపోతే ఆ ఏనుగు పిల్ల ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. తల ఊపు కుంటూ పెట్టిన ముద్దలు మొత్తం తిన్నది. ఆ తర్వాత తన తొండంతో కడుపునిండా నీళ్లు తాగింది . బొజ్జనిండా ఆహారం ఉండడంతో కునుకు తీసేందుకు ఉపక్రమించింది. దానికి తగ్గట్టుగానే కొద్దిసేపు విశ్రమించింది .. ఇక దీనికి సంబంధించిన వీడియోను ఓ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి షేర్ చేశారు. ” మీకు అందమైన వీడియోను చూడాలని ఉంటే.. ఈ వీడియోను ఒకటికి రెండుసార్లు చూడండి. ఆ తర్వాత మీరు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ప్రశాంత జీవితాన్ని కాసేపు ఆస్వాదిస్తారు. ఆ వీడియో చూస్తున్నంత సేపు మీలో మీరే నవ్వుకుంటారు. ప్రశాంతతను ఆస్వాదిస్తారు. ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందుతారు. సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తారు. ఎందుకంటే ఇలాంటి వీడియోలు అరుదుగానే దొరుకుతాయి. అలాంటి వాటిని భద్రపరచుకొని మళ్లీమళ్లీ చూడటం మనకు అవసరం. ఎందుకంటే ఇంతటి ఒత్తిడి జీవితంలో కాస్త ప్రశాంతతను కోరుకోవడంలో తప్పులేదు కదా” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వీడియో ఎక్కడ తీశారో మాత్రం చెప్పలేదు. నెటిజన్లు మాత్రం అస్సాం అడవుల్లో తీసి ఉంటారని పేర్కొంటున్నారు. అక్కడ ప్రభుత్వ వన్యప్రాణి కేంద్రాలలో ఏనుగులను సంరక్షిస్తుంటారు. గాయపడిన ఏనుగులకు ప్రపంచ స్థాయి పరిజ్ఞానంతో చికిత్స అందిస్తూ ఉంటారు.
Also Read : మల బద్దకాన్ని ఇంత క్రియేటివ్ గా చెప్పొచ్చా.. వైరల్ హోర్డింగ్