Vinayaka chavithi : మనుషులు, జంతువుల జీవితాలు చాలా తేడా ఉంటాయి. కొన్ని జంతువులు మనుషుల కంటే ఎక్కువ పనిచేస్తాయి. కానీ జంతువులకు మెదడు ఉండకపోవడం వల్ల మనుషుల్లా ఆలోచించవని కొందరు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో అవి దాడి చేసినప్పుడు ఏమాత్రం కరుణ, దయ లేకుండా ప్రవర్తించి.. మనుషులను చంపేదాక వదలవు. ఒక జంతువును మనిషి కంట్రోల్ చేయగలడు. కానీ అవి రెచ్చిపోతే మాత్రం ఎవరి వల్ల సాధ్యం కాదు. అయినా ఒక్కోసారి మనుషులు, జంతువుల మధ్య సత్సంబంధాలు ఉంటాయి. చాలా మందికి జంతు ప్రేమ ఉంటుంది. దీంతో కొందరు తమ ఇంట్లో కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వాటికి ఒక కుటుంబ సభ్యుల్లాగా ట్రీట్ చేస్తారు.వాటిని అలా ప్రేమగా చూడడం వల్ల అవికూడా మనుషులపై విశ్వాసం చూపిస్తాయి అని అంటారు. అయితే ఇక్కడ ఓ జంతువును ఏ మనిషి ప్రేమగా చూడలేదు. కనీసం దానిని పెంచుకోలేదు. కానీ ఒక మనిషి ఆపదలో ఉంటే చూడలేక వెంటనే వచ్చి కాపాడింది. ఆ స్టోరీ ఏంటో తెలుసుకోండి..
జంతువుల్లో గజేంద్రుడు (ఏనుగు) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భారీ కాయంతో ఉన్న ఈ జంతువులకు కోపం వస్తే మనుషులను తొక్కేస్తాయి. వీటిని కంట్రోల్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. అయితే ఇవి ఎంతో ఆగ్రహంతో ఉంటాయో.. అంతే ప్రేమతో ఉంటాయి. అంతేకాకుండా వినాయకుడికి, ఏనుగుకి సంబంధం ఉంది. గజేంద్రుడి తలను వినాయకుడికి పెట్టారని కొన్ని కథల ద్వారా తెలుస్తుంది. దీంతో ఏనుగును దేవుడితో సమానంగా పూజిస్తాం. రెండు ఏనుగుల చిత్రాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెబుతారు.
వినాయక చవితి సందర్భంగా ఇక్కడ ఓ ఏనుగు మానవత్వం చూపించింది. ఒక జంతువు మరో జంతువుపై ప్రేమ చూపడం.. వాటిని కాపాడడం చూశాం.. కానీ ఇక్కడ ఓ మనిషి ఆపదలో ఉండడంతో ఆయనను ఓ ఏనుగు ఆరాటపడి మరీ కాపాడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి వరదలో కొట్టుకొని పోతుంటాడు. ఇది అడవి కాబట్టి అక్కడ అతడిని కాపాడడానికి అందుబాటులో ఎవరూ లేరు. కానీ అక్కడ కొన్ని ఏనుగులు మాత్రం ఉన్నాయి.
మనిషి వరదలో కొట్టుకుపోవడాన్ని చూసిన ఏనుగుల్లో ఒకటి చూసి చలించిపోయింది. వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి పరుగులు పెట్టింది. దీంతో అతనిపై దాడి చేస్తుందని అనుకున్నారు. భారీ వరదను సైతం లెక్క చేయకుండా ఆ ఏనుగు పరుగులు పెట్టి వ్యక్తిని నీటిలో నుంచి బయటకు తీసింది. ఆ తరువాత ఒడ్డున చేర్చింది. ఈ వీడియో దూరంగా ఉన్న ఓ వ్యక్తి షూట్ చేశాడు. ఆ తరువాత సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఈ సందర్భంగా ఈ వీడియోకు లైక్స్ విపరీతంగా వచ్చాయి. ఈ కాలంలో మనుషులు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఫోన్ కెమెరా పట్టి షూట్ చేసేవారు ఉన్నారు. కానీ ఓ భారీ జంతువు ఆ వ్యక్తిని కాపాడడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
Chai Muchhata is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More