Viral Video : రోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ప్రస్తుతం నెట్టింట ఓ ఇంగ్లీషులో మాట్లాడుతున్న బిచ్చగాడు వీడియో వైరల్ అవుతోంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన ఓ యువకుడు బిచ్చగాడిగా మారిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎవరి జీవితం ఎప్పులు ఎలా మలుపు తిరుగుతుందో తెలియదు. దీన స్థితిలో ఉన్నవారికి అదృష్టం తలుపు తడితే మంచి స్థాయిలో ఉంటారు. అదే కొందరికి దురదృష్టం ఉంటే మంచి స్థాయిలో ఉన్నవారు కూడా కిందికి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇలా ఏమీ లేని వాళ్లు కూడా మంచి పొజిషన్‌కి వెళ్లిన వారు మన చుట్టూ చాలా మంది ఉంటారు. కొందరు బాగా చదువుకుని, ఉద్యోగం చేసి చివరకు రోడ్డు మీద పడిన సంఘటనలు కూడా రోజూ మనం చాలానే చూస్తుంటాం. అయితే తాజాగా బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బిచ్చగాడిగా మారిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి అడగ్గా ఇంగ్లీషులోనే మాట్లాడుతూ అన్ని విషయాలు చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. బెంగళూరుకి చెందిన ఓ వ్యక్తి గతంలో గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. ఎంతో సంతోషంగా జీవితం సాగుతుందనుకున్న సమయంలో కొన్ని అనారోగ్య కారణాల వల్ల తన తల్లిదండ్రులు మరణించారు. దీంతో అతని జీవితం చీకట్లోకి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు, తన కంటూ తోడు ఎవరూ లేకపోవడంతో పూర్తిగా తాగుడికి బానిసయ్యాడు. దీంతో ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కూడా పోయింది. అప్పటి నుంచి రోడ్డు మీద భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆ వ్యక్తే స్వయంగా తెలిపాడు. ఓ వ్యక్తి అన్ని విషయాలు అడగడంతో ఆ బిచ్చగాడు పూర్తి విషయాలు తెలియజేశాడు. దీంతో నెటిజన్లు చాలా కన్నీటి పర్యాంతమయ్యారు. మంచిగా చదువుకున్న వ్యక్తి, ఓ మంచి పొజిషన్‌లో ఉండి ఉద్యోగం చేస్తూ.. ఇప్పుడు ఇలా కావడంతో వారు బాధపడుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసిన అతను.. ఎవరూ లేకపోవడంతో చివరికి ఒంటరిగా మారిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు జీవితాలు ఇలానే ఉంటాయా? అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏదైనా పిల్లలకు మంచి లేదా చెడు చెప్పడానికి తల్లిదండ్రులు ఉండాలి. కనీసం మన అనుకున్న వారు ఎవరో ఒకరు ఉండాలి. అప్పుడు జీవితం హాయిగా ఉంటుంది. తన కంటూ ఎవరో ఒకరు ఉంటే ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జీవితం ఇలా ఉండేది కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతోంది.
Heartbreaking
This guy, who completed his MS in Frankfurt and worked at Mindtree, is now begging in Bengaluru.
He suffered severe psychological trauma after losing both his parents and his long-term girlfriend.
Hope he recovers soon.
credits Sharath_yuvaraja_official pic.twitter.com/b69MVqJkHh
— Raja (@whynotraja) November 22, 2024
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Software engineer turned beggar video going viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com