Bike Toilet : బైక్ టాయిలెట్.. ఇదేం క్రియేటివిటీరా సామి!
క్రియేటివిటీ నేటి రోజుల్లో పరిధి దాటుతోంది. కొందరు అవసరం కోసం క్రియెటివిటీ చేస్తుంటే.. కొందరు రికార్డు కోసం చేస్తారు. ఇంకొందరు వెరైటీ అనిపించుకోవడానికి చేస్తుంటారు.
Bike Toilet : క్రియేటివిటీ రోజు రోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక, సోషల్ మీడియా వినియోగం పెరిగింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ కోసం కొందరు తమలోకి క్రియేటివిటీని బయట పెడుతుంటారు. కొందరు రికార్డుల కోసం లైక్స్, షేర్స్ కోసం క్రియేటివిటీ ఆలోచన చేస్తున్నారు. స్టంట్స్, స్కిట్‌లు చేస్తూ వైరల్ అవుతున్నారు. కొందరి టాలెంట్ పది మందికి ఉపయోగపడుతుంది. కొందరి టాలెంట్ ఓవర్‌నైట్ బయటకు వస్తుంది. కానీ, ఇక్కడ ఓ వ్యక్తి చేసిన క్రియేటివిటీ మెచ్చుకోవచ్చు. కానీ, ఎవరికీ పనికిరాని ఆలోచన ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతుంది. మరి ఆ క్రియేటివిటీ ఏమిటి.. ఎందుకు పరికిరాదో తెలుసుకుందాం..
సోషల్ మీడియాలో వైరల్..
ఓ వ్యక్తి పాత బైక్ పార్ట్ ఉపయోగించి ఓ మొబైట్ టాయిలెట్ తయారు చేశాడు. మొబైల్ టాయిలెట్ అంటే.. ఎక్కడైనా వినియోగించుకోవచ్చు అనుకుంటాం. కానీ, ఈ వ్యక్తి తయారు చేసిన టాయిలెట్ బైక్ టాయిలెట్. దీనిని ఎక్కడికీ తీసుకెళ్లలేము. ఓ గదిలో పెట్టుకుని మాత్రమే వాడుకోవాలి. కానీ, తనకు వచ్చిన ఆలోచనతో టాయిలెట్ ఎలా ఉపయోగించాలి, తర్వాత నీళ్లు ఎలా వస్తాయో ఈ వీడియోలో కనిపిస్తుంది. యూజ్ చేసిన తర్వాత బైక్ హ్యాండిల్‌కు ఉన్న బటన్ ప్రెస్ చేయగానే నీళ్లు వచ్చి శుభ్రం అవుతాయి. ఈ క్రియేటివిటీ వీడియో hergun1insaat అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. దీనిని చూసి నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
కామెంట్లు ఇలా…
ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు క్రియేటివిటీని అభినందిస్తున్నారు. కానీ, వేస్ట్ ప్రొడక్ట్ అని కొందరు. కొందరు లాఫింగ్ ఈమోజీలు, కొందరు వాట్ ఏ టెక్నాలజీ అని, వావ్ సూపర్ అని ఇంకొందరు పోస్టు చేస్తున్నారు.