https://oktelugu.com/

Viral Video : రేసింగ్ పిచ్చి శృతి మించింది.. అది ఎంతటి దారుణానికి దారి తీసిందంటే.. వీడియో వైరల్

రాత్రి 11 దాటిందంటే చాలు.. వాళ్ల వాహనాలు రోడ్లమీదకి వస్తాయి. గాలి కంటే వేగంగా.. ధ్వని కంటే స్పీడ్ గా దూసుకుపోతాయి. ఆ సమయంలో ఎవరైన ఎదురుగా వస్తే చాలు ప్రాణాలు గాలిలో కలిసిపోవటమే.. అలాంటి సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 16, 2024 / 05:13 PM IST

    Viral Video

    Follow us on

    Viral Video :  యువత.. బైక్ రేస్ ను స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. అత్యధిక సామర్థ్యం ఉన్న వాహనాలను నడుపుతూ ప్రజల ప్రాణాలకు ముప్పు తీసుకొస్తున్నారు. అటువంటి సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కూచ్ బేహార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బైక్ లపై రేసింగ్ చేస్తూ ఇద్దరు యువకులు చేసిన ప్రమాదకరమైన విన్యాసాలు ఇతరుల ప్రాణాల మీదికి తెచ్చాయి. ఈ దారుణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తోంది.. అర్ధరాత్రి దాటితే చాలు బైకర్లు రేసింగ్ లకు పాల్పడుతూ చిత్రచిత్రమైన విన్యాసాలు చేస్తుకలిసేలా అత్యంత వేగంగా వారు రేసింగ్ చేస్తుండడం ఇతరుల ప్రాణాలను గాలిలో కలిసేలా చేస్తోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కూచ్ బెహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వేగంగా దూసుకు వస్తున్న బైక్ అదే మార్గంలో ఉన్న ఓ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఆ బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు మంటల్లో కాలిపోయి.. అక్కడికక్కడే మరణించారు..

    ఆలస్యంగా వెలుగులోకి..

    అక్టోబర్ 11వ తేదీ అర్ధరాత్రి పూట ఈ సంఘటన జరిగినట్టు సిసి పుటేజీలో రికార్డ్ అయిన వీడియో ద్వారా తెలుస్తోంది. ఆ బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు వేగంగా నడుపుకుంటూ వస్తున్నారు. మధ్యలో ఓ భారీ వాహనాన్ని ఢీకొట్టారు. బైక్ పై వస్తున్న వ్యక్తులు దాని వేగాన్ని కంట్రోల్ చేయలేకపోవడంతో ఆ వాహనాన్ని ఢీకొట్టినట్టు సీసీ కెమెరాలు రికార్డ్ అయిన వీడియో ద్వారా చూస్తే తెలుస్తోంది. ఈ సంఘటన హుగ్లీలోని పోల్ బార్ రాజ్ ఘాట్ ఇంటర్ సెక్షన్ వద్ద చోటుచేసుకుంది. ఆ ఘటనలో ఆ ఎస్ యూవీ వాహనం కూడా ధ్వంసం అయింది. ఆ వాహన డ్రైవర్ యూ టర్న్ తీసుకుంటుండగా.. ఓ బైకర్ ఆ వాహనం ముందు నుంచి దూసుకుపోయాడు. అయితే దాని వెనుక నుంచి వచ్చిన మరో బైక్ ఆ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం వల్ల పెద్ద పేలుడు సంభవించింది. మంటలు చెలరేగాయి. బైక్ నడిపిన వ్యక్తి.. దాని వెనుక కూర్చున్న వ్యక్తి మంటల్లో కాలిపోయి చనిపోయారు. వారిద్దరిని ఆ మంటలనుంచి కాపాడడానికి స్థానికులు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. మంటలు ఏమాత్రం అదుపులోకి రాకపోవడంతో.. వారిద్దరూ అక్కడికక్కడే కాలిపోయారు. ఆ ఎస్ యూ వీ వాహనంలో ఉన్నవారు గాయపడ్డారు. అయితే ఆ రోడ్డు మీద అక్టోబర్ 11 అర్థ రాత్రి బైక్ రేసింగ్ పోటీలు నిర్వహించాలని తెలుస్తోంది.. అందువల్లే ఓ రేసర్ తన బైక్ ను అత్యంత వేగంగా నడిపాడు. ఆ ఎస్ యూవీ వాహనాన్ని క్షణకాలంలోనే తప్పించి దూసుకుపోయాడు. కానీ అదే మార్గంలో వస్తున్న మరో బైకర్ ఎస్ యూవీ వాహనం యూ టర్న్ తీసుకోవడంతో.. దానిని బలంగా ఢీకొట్టాడు. స్పీడ్ కంట్రోల్ చేయలేక ఢీకొట్టడంతో మంటలు వ్యాపించి.. సంఘటనా స్థలంలోనే ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు.