Nick Jonas: డేంజర్ లో ఉన్న ప్రియాంక చోప్రా భర్త.. షో మధ్యలో భయపడి పారిపోయిన నిక్ జోనాస్!

ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి జంట చూసేందుకు చాలా ముచ్చటగా ఉంటుంది.

Written By: Vicky, Updated On : October 16, 2024 5:34 pm

Nick Jonas(1)

Follow us on

Nick Jonas: మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్, మార్కెట్ ఉన్న హీరోయిన్లు చాలా తక్కువమంది మాత్రమే ఉంటారు. ఆ తక్కువమంది హీరోయిన్స్ లో ఒకరు ప్రియాంక చోప్రా. బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ని అందుకున్న ఈమె, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా భారీ హిట్స్ ని అందుకొని తన సత్తా చాటింది. అలా బాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈమెకు, హాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. ‘బేవాచ్’ చిత్రం లో విలన్ రోల్ ద్వారా హాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైన ఆమె, ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో మంచి క్రేజ్ ని సంపాదించింది. ఇక ఆ తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా హాలీవుడ్ మూవీస్ లో అవకాశాలు సంపాదిస్తూ హీరోయిన్ గా, విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా, ఇలా విభిన్నమైన పాత్రలతో ముందుకు దూసుకుపోతుంది.

అయితే ఈమె ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి జంట చూసేందుకు చాలా ముచ్చటగా ఉంటుంది. వీళ్ళు అన్యోయంగా కలిసి ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటాయి. అయితే రీసెంట్ గా నిక్ జోనాస్ కి ప్రాణ హాని ఉందని మీడియా లో చక్కర్లు కొడుతున్న ఒక వార్త అభిమానులను కలవర పెడుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే నిక్ తన సోదరులతో కలిసి ప్రేగ్ లో ఒక లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ ని నిర్వహించాడు. ఈ కన్సర్ట్ జరుగుతున్న సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి నిక్ పై లేజర్ లైట్ వేసాడు. దీంతో భయబ్రాంతులకు గురైన నిక్ జోనాస్, షోని మధ్యలోనే ఆపేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ ఘటన గురించి తన సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించాడు. లేజర్ లైట్ కొన్ని ప్రత్యేకమైన గన్స్ లో ఉంటుందనే విషయం తెలిసిందే. గన్ గురిపెట్టినప్పుడు లేజర్ లైట్ టార్గెట్ పై పడుతుంది. అందుకే నిక్ జోనస్ అనుమానించి అంత భయపడ్డాడు.

అయితే సెక్యూరిటీ సిబ్బంది నిక్ పై లేజర్ వేసిన వ్యక్తిని గుర్తించారు. అతని దగ్గర అనుమానాస్పదంగా ఏ మారణాయుధం లేకపోవడం తో అతన్ని పోలీసులకు పట్టించకుండా, కేవలం ఆ ప్రాంగణం నుండే పంపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మరి అతగాడు నిక్ పై లేజర్ లైట్ ఎందుకు వేసినట్టు?, ఒకవేళ ఎవరైనా తనని గుర్తించారనే విషయం తెలుసుకొని మారుణాయుధాన్ని దాచేసాడా వంటివి తెలియాల్సి ఉంది. కానీ ఆ ప్రాంగణం లో అనుమాస్పదంగా ఏమి కనిపించలేదు. ఇంత అనుమానాస్పదంగా ఉన్నప్పుడు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీస్ కేసు పెట్టొచ్చు కదా అని సోషల్ మీడియా నెటిజెన్స్ అంటున్నారు.