Viral Video: కోవిడ్ తర్వాత దేశంలో గుండెపోటు(Hart Attack) మరణాలు ఎక్కువయ్యాయి. కోవిడ్ వ్యాక్సిన్(Covid Vaccin)కారణంగానే హార్ట్ ఎటాక్స్ పెరిగాయని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయాన్ని వ్యాక్సిన్ తయారీ కంపెనీలు కూడా నిర్ధారిస్తుతన్నాయి. అయితే డబ్ల్యూహెచ్(WHO)వో మాత్రం అంగీకరించడం లేదు. తాజాగా మరో ఘటన జరిగింది.
వివాహ జీవితంలో 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఓ జంట సిల్వర్ జూబ్లీ(Silver Jublee) వేడుకలను ఘనంగా నిర్వహించింది. కుటుంబ సభ్యుల సూచనతో జరిగిన ఈ సంబరంలో బంధువులు, అతిథులు ఆనందంగా పాల్గొన్నారు. వేదికపై కొందరు అమ్మాయిలు ఆ జంటతో కలిసి డ్యాన్స్(Dance)చేస్తూ సందడి సృష్టించారు. అయితే, ఈ సంతోషకరమైన క్షణాలు కాసేపటికే విషాదంగా మారాయి. డ్యాన్స్ మధ్యలో భర్త అచేతనంగా కుప్పకూలడంతో భార్య గుండెలు పగిలేలా రోదించింది. ఈ దృశ్యం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
ఉత్తరప్రదేశ్‌లో ఘటన..
ఉత్తర ప్రదేశ్(UttaraPradesh)లోని బరేలీకి చెందిన షూ వ్యాపారి వసీం సర్వత్(Wasim Sarwanth) తన 25వ వివాహ వార్షికోత్సవాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. భార్య ఫరాతో కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తుండగా, ఒక్కసారిగా ఆయన కిందపడిపోయారు. ఈ ఘటనతో అక్కడున్నవారంతా ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ, గుండెపోటుతో ఆయన ఇప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. భర్తను కళ్లెదుటే కోల్పోయిన ఫరా విలపిస్తూ కన్నీరుమున్నీరుగా మారింది. వసీం కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలి కాలంలో హఠాన్మరణాలు పెరుగుతున్నాయి. ఆరోగ్యంగా, హుషారుగా కనిపించే వ్యక్తులు ఉన్నట్లుండి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
జీవనశైలి మారాలి..
హఠాన్మరణాల నేపథ్యంలో వైద్యులు ఇప్పటికే పలు సూచనలు చేస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలని సూచిస్తున్నారు. అత్యవసర సందర్భాల్లో సీపీఆర్ (కార్డియోపల్మనరీ రిససిటేషన్) వంటి ప్రథమ చికిత్సలపై ప్రజలకు అవగాహన కల్పించడం తప్పనిసరని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఊహించని ఘటనలు సమాజంలో ఆరోగ్య స్పృహను మరింత పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. ఈ విషాదం వసీం కుటుంబానికి తీరని లోటును మిగిల్చింది. సంతోషంగా ప్రారంభమైన సిల్వర్ జూబ్లీ వేడుకలు అంత్యక్రియలతో ముగియడం అందరినీ కలచివేసింది.
2 April 25 : Shoe merchant Wasim died of a #heartattack2025 while dancing with his wife on his 25th wedding anniversary in Bareilly district of Uttar Pradesh.#LuciferShotWorking #ChipShot pic.twitter.com/OrHYonE2NP
— Anand Panna (@AnandPanna1) April 3, 2025