Summer: వేసవి రాగానే విద్యార్థులకు ఎక్కడలేని సంతోషం ఉంటుంది. ఎందుకంటే వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత కనీసం రెండు నెలల పాటు సెలవులు ఉంటాయి. ముఖ్యంగా పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల తర్వాత విద్యార్థులు పగలంతా ఈతకు లేదా స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడడం వంటివి చేస్తూ ఉంటారు. సాయంత్రం ఐపీఎల్ మ్యాచ్ లేదా OTT లో సినిమాలు చూస్తూ గడుపుతూ ఉంటారు. అయితే ఈ సెలవులను ఇలా వృధా చేయకుండా కొన్ని ముఖ్యమైన పనులకు ఉపయోగించుకోవాలని విద్యారంగ నిపుణులు తెలుపుతున్నారు. సెలవులతో కొన్ని ప్రణాళికలు వేసుకోవడం వల్ల బంగారు భవిష్యత్తు ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఇంతకీ సెలవుల్లో ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి?
Also Read: IPL లో అద్భుతం.. రెండు చేతులతో బౌలింగ్.. ఒక వికెట్ కూడా..
పదవ తరగతి పూర్తికాగానే విద్యార్థులు బంధువుల ఇంటికి సరదా కోసం వెళ్తారు. ఇక్కడ ఎక్కువ సమయం స్నేహితులతోనే గడుపుతూ ఉంటారు. అయితే పదవ తరగతి పూర్తయిన విద్యార్థులకు ఇప్పటినుంచే భవిష్యత్తు గురించి ఆలోచనలు ఉండే విధంగా తల్లిదండ్రులు తయారు చేయాలి. వారిని ఎక్కువసేపు స్నేహితులతో గడపనీయకుండా భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవాలి. ముఖ్యంగా పదవ తరగతి పూర్తికాగానే ఇంటర్మీడియట్ లో ఏ కోర్సు చదవాలి? అందుకోసం ఎలాంటి కళాశాల బాగుంటుంది? అనే విషయాలు తెలుసుకోవాలి. అంతేకాకుండా పదవ తరగతి పూర్తయిన తర్వాత ఎంపీసీ, బైపిసి వంటివి మాత్రమే కాకుండా మిగతా కోర్సులు ఏమేమి ఉన్నాయి? వాటి వల్ల ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది? అనేది తెలుసుకోవాలి.
ముఖ్యంగా పదవ తరగతి పూర్తయిన విద్యార్థులు కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. నేటి కాలంలో ఏ రంగం చూసిన కంప్యూటర్ మయం అయిపోతుంది. అందువల్ల ముందే కంప్యూటర్ గురించి నాలెడ్జి తెలుసుకోవడం వల్ల తర్వాత ఎటువంటి కోర్సు చేసిన ఆ కోర్సు గురించి ఈజీ అవుతుంది.అంతేకాకుండా భవిష్యత్తులో కంప్యూటర్ సైన్స్ తీసుకునే అవకాశం ఉంటే ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నట్లు అవుతుంది. అందువల్ల కంప్యూటర్ నాలెడ్జిని ఉంచుకోవడానికి ఎలాంటి కోర్సు అయినా చేయడానికి ప్రయత్నించాలి.
ఇక ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంచుకున్న రంగమే జీవితంలో కీలకంగా మారుతుంది. అందువల్ల ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత విద్యార్థులు ఎటువంటి రంగంలో పనిచేయాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. అలాగే ఏఏ కోర్సులు ఎలాంటి భవిష్యత్తును అందిస్తాయో తెలుసుకోవాలి.
ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు సాయం అందించాలి. భవిష్యత్తులో ఎలాంటి రంగానికి డిమాండ్ ఉంటుంది? ఏ కోర్సులో చేరడం వల్ల జీవితం బాగుంటుంది అనే విషయాలను తెలుసుకొని వాటిని పిల్లలకు వివరించాలి.
ఇలా వేసవిలో ప్రత్యేకంగా భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకొని వాటి పైనే దృష్టి పెట్టాలి. ఈ సమయంలో ఏవైనా పోటీ పరీక్షలు ఎదురైతే వాటిలో కచ్చితంగా పాల్గొనిటట్లు చేయాలి. ఎందుకంటే కొన్ని పోటీ పరీక్షలు భవిష్యత్తు చదువుకు ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో పాల్గొనడం వల్ల నాలెడ్జ్ కూడా పెరుగుతుంది.