Viral Video : జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ ప్రాంతాలలో చలి విపరీతంగా ఉంది. ఇక్కడ మంచు కూడా దట్టంగా కురుస్తోంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతాలలో చలి విపరీతంగా ఉంది. ముఖ్యంగా హిమాలయాలకు దగ్గర్లో ఉన్న రాష్ట్రాలలో అయితే చలి కనివిని ఎరుగని స్థాయిలో ఉంది. అందువల్లే అక్కడ మైనస్ డిగ్రీలలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లోని బనిహల్ రైల్వే స్టేషన్ ప్రాంతం మొత్తం శ్వేత వర్ణంతో నిండిపోయింది. ఈ ప్రాంతం హిమాలయాలకు దగ్గరగా ఉండడంతో మంచు దట్టంగా కురుస్తోంది. ఫలితంగా ఆ ప్రాంతాలు మొత్తం శ్వేత వర్ణంలోకి మారిపోయాయి. ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. బని హాల్ రైల్వే స్టేషన్ ప్రాంతం మొత్తం మంచుతో నిండిపోయి శ్వేతవర్ణంలో కనిపిస్తున్న నేపథ్యంలో.. ఈ దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. ఈ వీడియోను ప్రకృతి ప్రేమికులు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తూ.. భూలోక స్వర్గం ఇంతకన్నా గొప్పగా ఉంటుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
వణికి పోతున్నారు
మంచు విపరీతంగా కురుస్తున్న నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాలు గజాగజా వణికి పోతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. రోడ్లపై మంచు దట్టంగా కురవడంతో వాహనాల రాకపోకలు స్తంభిస్తున్నాయి. ముఖ్యంగా మనాలి ప్రాంతంలో గత కొద్దిరోజులుగా విపరీతంగా మంచు కురవడంతో అక్కడ వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడంతో రోడ్లపై వాహనాలు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, పర్యాటకులు ఆ ప్రాంతంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కొందరు అక్కడి ట్రాఫిక్ కష్టాలు తట్టుకోలేక ” దయచేసి నూతన సంవత్సర వేడుకలకు రాకండి.. ఇక్కడ పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు.. అడుగు తీసి అడుగు వేయాలంటేనే ఇబ్బందిగా ఉంది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. హోటళ్ళు మొత్తం నిండిపోయాయి. ఈ ప్రాంతం మాత్రమే కాదు హిమాలయ బెల్టు మొత్తం కూడా ఇలానే ఉంది. అందువల్ల మీ మీ ప్రాంతాల్లోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోండి. ఇక్కడికి వస్తే మాత్రం ఇబ్బంది పడతారని” ప్రయాణికులు, పర్యాటకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక బనిగల్ రైల్వే స్టేషన్ ప్రాంతాన్ని చూసిన పర్యాటకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు..” భూలోక స్వర్గం అంటే ఇలానే ఉంటుంది కాబోలు. శ్వేత వర్ణంలో మెరిసిపోతోంది. ఎటు చూసినా మంచు కనిపిస్తోంది. మంచు కరగకుండా సూర్యుడు కనిపించడం మానేశాడు. స్విట్జర్లాండ్ నగరాన్ని భారతదేశంలోని చూడటం గొప్ప అనుభూతిగా ఉంది. ఈ ప్రాంతం సరికొత్త ఆనందాన్ని.. అవధులు లేని ఉల్లాసాన్ని అందిస్తోందని” పర్యాటకులు వ్యాఖ్యానిస్తున్నారు.
జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని బని హాల్ రైల్వే స్టేషన్ ప్రాంతం శ్వేత వర్ణంలోకి మారిపోయింది. ఇక్కడ దట్టంగా మంచు కురవడంతో చుట్టుపక్కల పర్వతప్రాంతాలు ఆకట్టుకుంటున్నాయి. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి.#JammuKashmir#banihalrailwaystation pic.twitter.com/nglwvIoE6x
— Anabothula Bhaskar (@AnabothulaB) December 29, 2024