Japan: ఈ ప్రపంచంలో ఎన్నో భయంకరమైన అడవులు ఉన్నాయి. అందులో జపాన్‌లోని అకిగహారా ఫారెస్ట్ ఒకటి. దీన్నే సూసైడ్ ఫారెస్ట్ అని కూడా అంటారు. ఈ అడవి చాలా భయంకరమైనది. ఈ పారెస్ట్‌లోకి వెళ్లిన వారు ఇప్పటికీ తిరిగి వచ్చినట్లు చరిత్రలో లేదు. వెళ్లిన ప్రతీ ఒక్కరూ కూడా చనిపోవడమే.. కానీ బతికి ఇప్పటి వరకు రాలేదు. జపాన్ రాజధాని టోక్యోలో ఉన్న అకిగహారా అడవికి ఎవరూ వెళ్లిన తిరిగి రావడం కష్టమే. ఎందుకంటే ఈ అడవికి వెళ్లిన వారు ఎవరూ కూడా ఆత్మహత్య చేసుకోకుండా రారు. ఈ అడవిలో ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని హెచ్చరిస్తూ అధికారులు ఓ బోర్డును కూడా పెట్టారట. అయిన కూడా ఇక్కడ ఆత్మహత్యలు మాత్రం తగ్గవు. ప్రపంచంలో ఉన్న డేంజర్ సూసైడ్ పాయింట్లలో ఇది ఒకటి. ఈ అకిగహారా అడవి చాలా దట్టంగా చెట్లతో నిండి ఉంటుంది. అందుకే దీన్ని చెట్ల సముద్రం అని అంటారు. ప్రకృతి సుందరమైన ఈ అడవిలో ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటారు. శాన్ ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఆత్మహత్యల్లో టాప్‌లో ఉండగా.. అకిగహారా రెండో స్థానంలో ఉంది. వెయ్యి సంవత్సరాల క్రితం నాటి నుంచి ఉన్న ఈ అడవిలో ఇలానే ఆత్మహత్యలు చేసుకుంటున్నారట. అయితే గతంలో ఈ అడవి ఉండే ప్రదేశంలో లావా ప్రవహించేదట. ఆ తర్వాత ఫజి పర్వతం వల్ల భారీ పేలుడు సంభవించడంతో అక్కడ ఉండే గ్రామాలు అన్ని కూడా సమాధి అయ్యాయి. ఆ తర్వాత ఈ అకిగహారా అడవిగా మారింది.
విడిపోయిన ప్రేమ జంటలు, జీవితం మీద ఆసక్తి లేని వారు, అనుకున్నవి లైఫ్‌లో చేయలేని వారు ఎక్కువగా ఇక్కడికి వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇక్కడికి వెళ్లి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. అసలు వెళ్లిన వారు ఆత్మహత్య చేసుకోకుండా తిరిగి రావడం కూడా కష్టమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల రేటులో జపాన్ 26వ స్థానంలో ఉంది. ఇందులో పురుషులు 21.7 శాతం, మహిళలు 9.2 శాతం ఉన్నట్లు సమాచారం. ఈ అడవిలో ఎన్నో మాంత్రిక శక్తులు కూడా ఉన్నట్లు కొందరు అంటుంటారు. ఈ అడవిలో ఎక్కువగా దెయ్యాలు ఉన్నాయని, ఇవి కావాలని ఆత్మహత్యలు చేయిస్తాయని అంటుంటారు. అక్కడికి వెళ్లిన కొంతమందిని ఆ దెయ్యాలు ఆత్మహత్య చేసుకునేలా చేస్తాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఈ అడవుల్లో ఎవరైనా కూడా వెళ్తే తిరిగి రావడం కష్టమే. అసలు కంపాస్, మొబైల్ ఫోన్లు వంటివి కూడా ఈ అడవిలో పనిచేయవు. ఈ అడవి చాలా ప్రమాదకరమైనది స్థానికులు చెబుతుంటారు. రాత్రిపూట సమయంలో ఎక్కువగా అడవి నుంచి అరుపులు వినిపిస్తుంటాయి. 2003లో ఈ అడవిలో దాదాపుగా 105 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. వీరి మృతదేహాలను కూడా ఎంతో కష్టంతో తీశారట. ఇందులో కొన్ని కుళ్లిపోగా, మరికొన్నింటిని అడవి జంతువులు తినేశాయట. ఎక్కువ శాతం జంటలు ప్రేమ విఫలం కావడం వల్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎవరి ప్రేమ అయిన విఫలమైతే వెంటనే ఈ అడవికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటారట.