Man Set Train Fire After Divorce: మన దేశంలోనూ ఇటీవల కాలంలో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది.గతంలో ఈ వ్యవహారం సెలబ్రిటీల వరకే ఉండేది. ఇప్పుడు సామాన్యులు కూడా సర్దుకుపోవడానికి ఇష్టపడటం లేదు. పైగా వారి ఆహాలను వదిలిపెట్టడం లేదు. నీకు నువ్వే.. నాకు నేనే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. న్యాయస్థానాల గుమ్మం తొక్కుతున్నారు. భరణం ఎంత ఇచ్చయినా సరే బంధానికి శాశ్వత వీడ్కోలు పలుకుతున్నారు. ఆర్థిక స్థిరత్వం పెరగడం.. ఇష్టాలను గౌరవించకపోవడం.. తమ పెత్తనం మాత్రమే సాగాలని కోరుకోవడం.. తమ మాట మాత్రమే వినాలని భావించడం.. వివాహేతర సంబంధాలు .. ఇంకా ఇతర ఇతర కారణాలు విడాకులకు దారి తీస్తున్నాయి. కేవలం మనదేశంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ పై కారణాలు విడాకులకు కారణమవుతున్నాయి. కాకపోతే మనదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు బలంగా ఉంటాయి కాబట్టి విడాకులు తీసుకునే వారి శాతం తక్కువ. కానీ విదేశాలలో అలా కాదు. నచ్చినంతవరకు కలిసి ఉంటారు. నచ్చని తరుణంలో ఎవరికివారు కటీఫ్ చెప్పుకుంటారు. అయితే ఈవిడాకులు తీసుకున్న క్రమంలో కొన్ని సందర్భాల్లో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఇటువంటి సంఘటన దక్షిణ కొరియాలో చోటుచేసుకుంది.
Also Read: Tuni Train Fire Case : తుని రైలు దగ్ధం కేసు – కీలక పరిణామాలు.. రాజకీయ సంచలనం
రైలులో నిప్పు పెట్టాడు..
దక్షిణ కొరియాలోని సీయోల్ ప్రాంతానికి చెందిన 67 సంవత్సరాల వాన్ కు గతంలోనే వివాహం జరిగింది. వాన్ దంపతులకు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో వాన్, అతడి సతీమణికి వివాదాల చోటుచేసుకున్నాయి. దీంతో వాన్ కు విడాకులు ఇవ్వడానికి ఆయన భార్య సిద్ధమైంది. దీనిని అతడు ఒప్పుకోలేదు. అయినప్పటికీ వాన్ సతీమణి కోర్టుకెక్కింది. న్యాయమూర్తి ఎదుట తన ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలతో న్యాయమూర్తి ఏకీభవించి విడాకులు మంజూరు చేశారు. ఇన్ని సంవత్సరాల పాటు కలిసి ఉన్న భార్య విడాకులు ఇవ్వడాన్ని తట్టుకోలేక వాన్ ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యాడు. అంతేకాదు తన భార్య తీరును నిరసిస్తూ యౌయి నారు నుంచి మాపోకు వెళ్లే సబ్ వే రైలులో ఇంధనం పోసి నిప్పంటించాడు.. ఆ సమయంలో రైలు సముద్ర గర్భంలో పరుగులు పెడుతోంది. అయితే ప్రయాణికులు వేరే బోగీ లోకి పరుగులు పెట్టారు. ఫలితంగా వారు తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రమాదంలో దక్షిణ కొరియా రైల్వే శాఖకు 330 మిలియన్ యోన్ ల నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటన తర్వాత పోలీసులకు సమాచారం తెలియడంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఈ ఘటనకు కారణమైన వాన్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడి మానసిక పరిస్థితి బాగోలేదని తెలుస్తోంది. అందువల్లే అతనికి భార్య విడాకులు ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ సంఘటన దక్షిణ కొరియాలో సంచలనం సృష్టించింది.. ఈ ఘటన తర్వాత సముద్ర గర్భంలో ప్రయాణించే రైళ్లల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
Seoul prosecutors release footage of the moment a 67-year-old man poured gasoline and set fire to a packed subway train last month. He has been indicted today for attempted murder of all 160 passengers after divorce court anger boiled over.pic.twitter.com/eyFPiA3JmW
— Raphael Rashid (@koryodynasty) June 25, 2025