Home Prosperity Tips: ఇంటికి ఇల్లాలు దీపం అని అంటారు. ఇంటికి ఇల్లాలు దీపం మాత్రమే కాదు లక్ష్మీదేవి అని మరికొందరు చెబుతారు. ఇల్లు అందంగా ఉన్నా.. కళకళలాడుతూ ఉన్నా.. ఆ ఇల్లు సంతోషంగా ఉన్నా.. అందుకు కారణం ఆ ఇంటి ఇల్లాలి అని తెలుసుకోవాలి. ఇల్లాలు సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ దేవత ఉన్నట్లే. అయితే ఇల్లాలు సంతోషంగా ఎలా ఉంటుంది? ఎప్పుడూ ఉంటుంది? అనేది ఆ ఇంటి పెద్దపై ఆధారపడుతుంది. అంటే ఇల్లాలు సంతోషంగా ఉండడానికి ఆ ఇంటి పెద్ద అవసరమైన కృషి చేయాలి. ఇంతకీ ఇంటి పెద్ద ఏం చేయాలి?
డబ్బులు సంపాదించడం కోసం లక్ష్మీ దేవతను పూజిస్తూ ఉంటాం. కానీ కొందరు ఇంట్లో ఉన్న దేవతను మాత్రం పక్కకు పెడతారు. అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇలా ఉన్న ఇల్లాలుపై విరుచుకుపడతారు. అనవసరమైన గొడవలు పెడతారు. సూటి పోటి మాటలతో ఇబ్బందులకు గురిచేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ ఇల్లాలు నిత్యం శోకం పెడుతుంది. ఇల్లాలు శోకం పెట్టడం వల్ల ఆమెకు మాత్రమే కాకుండా ఇంటికి కూడా మంచిది కాదు. అందువల్ల ఇల్లాలుకు కన్నీళ్లు రానీయకుండా చూడాలి. అలా అని మరి గారభం చేయాలని కాదు.. అనవసరమైన గొడవలు సృష్టించకుండా వారికి గౌరవం ఇవ్వాలి.
Also Read: జీవిత భాగస్వామి వెతుక్కోవడం అంత ఈజీ కాదు.. ఇవీ సవాళ్లు
ఉద్యోగం, వ్యాపారం కారణంగా పురుషులు పొద్దంతా కష్టపడి ఇంటికి వస్తారు. తాము ఎంతో కష్టపడ్డామని.. తమకు కావాల్సిన సౌకర్యాల గురించి ఇంట్లో అడుగుతూ ఉంటారు. కానీ ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పనితో బిజీగా ఉండే ఇల్లాలని మాత్రం పట్టించుకోరు. అలా పట్టించుకున్న వారు మాత్రం వారికి గౌరవం ఇస్తూ వారికి సేవ చేస్తూ ఉంటారు. ఇలా సేవలు పొందిన వారు ఎంతో సంతోషంగా ఉంటారు. వారి సంతోషంగా ఉంటే అక్కడ దేవతలు కొలువై ఉన్నట్లేనని ఆధ్యాత్మిక వాదులు చెబుతున్నారు.
అయితే కొన్ని సందర్భాల్లో దంపతుల మధ్య గొడవలు రావచ్చు. ఇలాంటి సమయంలో ఎవరో ఒకరు సహనం వహించి సమస్యను పరిష్కరించుకోవాలి. ఈ సమయంలో ఒకరిపై ఒకరు బెట్టు సాధించడం వల్ల ఇద్దరు నష్టపోతారు. అయితే ఎక్కువ శాతం పురుషులే కాస్త ఓపికతో ఉండి ఇల్లాలను బుజ్జగిస్తూ ఉండాలి. ఎందుకంటే సాధారణంగానే మహిళల కంటే పురుషుల వయసు పెద్దదిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో పురుషులే అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. వారి కంటే స్త్రీలు చిన్న వయసుతో ఉంటారు కాబట్టి.. గారాబం చేస్తూ ఉంటారు. అయితే ఇది పెరిగిపోయి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల పురుషులు ఒక అడుగు ముందు వేసి వారిని తమ దారికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అలా చేయడంవల్ల సమస్య అక్కడితో ముగిసిపోతుంది.
Also Read: Wife: మన లైఫ్ పార్ట్ నర్ లో ఉండాల్సిన లక్షణాలివీ
కొంతమంది ఆడవాళ్లు చిన్న చిన్న విషయాలకే హైరానా పడిపోతూ ఉంటారు. అయితే ఇలాంటి వారి విషయంలో కూడా కాస్త ఓపికతో ఉండడం మంచిది. ఎందుకంటే ఇలా చిన్న విషయాలకే తొందరపడేవారు ఎదుటివారిని నష్టపెట్టే విధంగా ఏ పని చేయాలని అర్థం చేసుకోవాలి. అయితే కొన్ని సమయాల్లో ఆడవారు సైతం బెట్టుకుపోకుండా సహనం పాటించాలి. అప్పుడే వారి ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఫలితంగా లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది.