IND U19 Vs ENG U19: ఇంగ్లీష్ దేశంలో భారత అండర్ 19 జట్టు ప్రస్తుతం పర్యటిస్తోంది. మొత్తంగా 5 వన్డే లు ఈ సిరీస్ లో ఆడుతోంది. తొలి వన్డేలో భారత్ జైత్రయాత్ర కొనసాగించింది. వీర విహారం చేసి విజయాన్ని అందుకుంది. మొత్తంగా ఇంగ్లీష్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. ఇటీవల జరిగిన సన్నాహక మ్యాచ్ లో భారత జట్టు ఏకంగా 444 పరుగుల స్కోర్ నమోదు చేసింది. ఇప్పుడు అదే జోరును తొలి వన్డేలో కొనసాగించింది. భారత జట్టుకు ఆయుష్ మాత్రే నాయకత్వం వహిస్తున్నాడు. అయితే తొలి వన్డే మ్యాచ్లో యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్య వంశీ దుమ్మురేపాడు. 19 బంతులు ఎదుర్కొని 48 పరుగులు చేసి అదరగొట్టాడు. మైదానంలో సునామీ సృష్టించాడు. విధ్వంసాన్ని ఇంగ్లాండ్ బౌలర్ల గురించి చూపించి.. తను ఎంతటి ప్రమాదకరమైన ఆటగాడినో సంకేతాలు పంపించాడు. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 42.2 ఓవర్లలోనే ఆల్ అవుట్ అయింది. 174 పరుగులకు కుప్ప కూలింది. ఇంగ్లాండ్ జట్టు మాజీ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్ 90 బంతులు ఎదుర్కొని హాఫ్ సెంచరీ చేశాడు. ఇసాక్ మహమ్మద్ 42 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక భారత బౌలర్లలో కన్శిక్ చౌహన్ 3 వికెట్లు పడగొట్టాడు. హేనీల్ పటేల్ రెండు వికెట్లు సాధించాడు. అంబరీష్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. మహమ్మద్ ఇనాన్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
Also Read: రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’.. వైసీపీ స్కానింగ్.. డబ్బులు పోగొట్టుకుంటున్న ప్రజలు!
ఇక 178 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన భారత జట్టు.. 24 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. నాలుగు వికెట్లు కోల్పోయి 178 రన్స్ చేసి అదరగొట్టింది. తద్వారా ఇంగ్లీష్ జట్టు మీద సులభమైన విజయాన్ని అందుకుంది. సూర్య వంశీ మాత్రమే కాకుండా కెప్టెన్ ఆయుష్ 21, వికెట్ కీపర్ అభిజ్ఞాన్ 45* పరుగులు చేసి ఆకట్టుకున్నారు ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ హోమ్, రాల్ఫీ చెరో వికెట్ సాధించారు. ఇక ఈ గెలుపు ద్వారా 5 వన్డేల సిరీస్ లో భారత్ 1-0 తేడాతో ముందంజ వేసింది. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లీష్ జట్టుతో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఐపీఎల్ లో అదరగొట్టిన సూర్య వంశీ, ఆయుష్ మాత్రమే ఈ సిరీస్లో ఆడుతున్నారు. ఇక ఇటీవల ఐపీఎల్లో సూర్యవంశీ అదరగొట్టిన విషయం తెలిసిందే. మైదానంలో పరుగుల వరద పారించిన విషయం విధితమే.
మైదానంలో ఉన్నంతసేపు వైభవ్ బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. ఏమాత్రం భయం అనేది లేకుండా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా అతడు కవర్ డ్రైవ్ లు ఆడిన విధానం ఈ మ్యాచ్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని.. జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు సూర్య వంశీ. అందువల్లే అతని పేరు ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.