Dil Raju Thammudu movie interview: ఈ ఏడాది దిల్ రాజు(Dil Raju) టైం ఎంత బాగుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కెరీర్ లో ఎంత పెద్ద స్టార్ హీరోతో సినిమా చేసినా మీడియం రేంజ్ బడ్జెట్ లోనే పూర్తి చేసే దిల్ రాజు, మొట్టమొదటిసారి ‘గేమ్ చేంజర్’ లాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేసాడు. ఆ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఐయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దిల్ రాజు ఇంకా కోలుకోడం కష్టం, ఆయన కెరీర్ ఇక అయిపోయినట్టే అని అందరూ అనుకుంటున్న సమయంలో, మూడు రోజుల గ్యాప్ లో విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘గేమ్ చేంజర్’ తో పోయిన డబ్బులు మొత్తం ఈ చిత్రం తో తిరిగి వచ్చేసింది.
ఇప్పుడు లేటెస్ట్ గా నితిన్(Actor Nithin) ని హీరో గా పెట్టి ‘తమ్ముడు'(Thammudu Movie) అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాని వచ్చే నెల నాల్గవ తేదీన విడుదల చేయబోతున్నారు. రీసెంట్ గానే విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. డైరెక్టర్ వేణు శ్రీరామ్ చాలా కొత్తగా ఈ చిత్రాన్ని రూపొందించాడు అనేది స్పష్టంగా తెలుస్తుంది. సినిమా విడుదల దగ్గర పడుతున్న సందర్భంగా ప్రొమోషన్స్ మొదలు పెట్టేశారు. అందులో భాగంగా దిల్ రాజు రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ చిత్రం గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అవి సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ చిత్రాన్ని ముందుగా నాని తో చేద్దామని అనుకున్నారట కదా, నిజమేనా అని అడిగిన ప్రశ్నకు దిల్ రాజు ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు.
Also Read: YS Jagan: వైఎస్ జగన్ పై మరో కేసు
ఆయన మాట్లాడుతూ ‘నాని(Natural Star Nani) తో ఈ సినిమాని చెయ్యాలని అనుకున్న మాట వాస్తవమే. MCA లో వదిన, మరిది మధ్య రిలేషన్ ని ఎలా అయితే చూపించామో, ఇందులో అక్కా, తమ్ముడి మధ్య రిలేషన్ ని అలా చూపించాలని అనుకున్నాము. కానీ నాని కి ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమాని ఆయనతో చేయలేకపోయాము. ఇక తర్వాత నితిన్ వద్దకు వెళ్ళాము. ఆయన వెంటనే ఒప్పుకున్నాడు. డైరెక్టర్ వేణు శ్రీరామ్ నాకు ఈ సినిమా వరకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి. కాస్త బడ్జెట్ అవసరం అవుతుంది అన్నాడు. కథ డిమాండ్ చేస్తుంది కాబట్టి నీ ఇష్టం అని చెప్పాము. అలా మొదలైన ఈ సినిమా బ్యాలన్స్ షీట్ చూస్తే 35 కోట్ల రూపాయిల బడ్జెట్ ఖర్చు అయ్యింది. కానీ సినిమా ఔట్పుట్ మాత్రం అద్భుతంగా వచ్చింది. జులై నాల్గవ తేదీన అందరికీ ఈ సినిమా ఒక గొప్ప థియేట్రికల్ అనుభూతిని ఇస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.