https://oktelugu.com/

Viral News : ఎన్నికల్లో ఈమెకు అండర్ వేర్ గుర్తు.. నెటిజన్ల ట్రోలింగ్

Viral News : ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తు విషయంలో అభ్యంతరాలు తెలియజేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆమె ఆ గుర్తును తన ప్రచార పోస్టర్లలో ప్రచురించి.. క్యాంపెయిన్ చేసింది.. అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఓటమిపాలైంది.

Written By:
  • NARESH
  • , Updated On : June 10, 2024 4:58 pm
    Elections simbol

    Elections simbol

    Follow us on

    Viral News : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల సంఘం గుర్తులు కేటాయిస్తుంది. గుర్తింపు పొందిన పార్టీలకు వాటి అధికారిక సింబల్స్ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో ఇబ్బంది ఉండదు. కానీ గుర్తింపు పొందని, స్వతంత్ర అభ్యర్థులకు ఈ సౌలభ్యం ఉండదు. అలాంటప్పుడు వారు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తుల మీదనే పోటీ చేయాల్సి ఉంటుంది. వాటి మీదనే ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం కేటాయించే గుర్తులలో చాలాసార్లు వివాదాలు చోటుచేసుకున్నాయి. కొన్నిసార్లు ఇవి ప్రత్యర్థి పార్టీలకు, అధికార పార్టీలకు, కొంతమంది స్వతంత్రులకు లాభం చేకూర్చాయి. అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో ప్రకారం.. ఎన్నికల సమయంలో ఓ అభ్యర్థికి ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తు వైరల్ గా మారింది..

    కేరళ రాష్ట్రంలో అలెప్పి ప్రాంతంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓ మహిళ పోటీలో నిలిచింది. ఆమె ఉన్నత విద్యావంతురాలు. సమాజ సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చింది. గుర్తింపు పొందిన పార్టీల తరఫున పోటీ చేయడం ఇష్టం లేక, స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగింది.. ఈ సందర్భంగా ఆమెకు ఎన్నికల సంఘం ” అండర్ వేర్” గుర్తు కేటాయించింది. ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తు విషయంలో అభ్యంతరాలు తెలియజేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆమె ఆ గుర్తును తన ప్రచార పోస్టర్లలో ప్రచురించి.. క్యాంపెయిన్ చేసింది.. అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఓటమిపాలైంది.

    2019 అలెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. అప్పటికంటే ఇప్పుడు సోషల్ మీడియా మరింత ప్రబలంగా మారింది కాబట్టి.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది..”అలెప్పీలో ఈవిడకు అండర్వేర్ గుర్తు కేటాయించారట. ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం పోలింగ్ స్టేషన్ కు వంద మీటర్ల దూరం లోపల ఎవరు ఎలక్షన్ గుర్తు తమ వద్ద కలిగి ఉండరాదు.. అలాంటప్పుడు ఈ అభ్యర్థిని పరిస్థితి ఏమిటి? రూల్ ఇస్ రూల్. రూల్ ఫర్ ఆల్” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లు వెత్తుతున్నాయి. కాగా, ఎన్నికల సంఘానికి గుర్తులు కేటాయించే విషయంలో సోయి లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని కొంతమంది మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ప్రచారం కోసం ఇలాంటి చేష్టలకు పాల్పడేవారు లేకపోలేదని మరికొందరు అంటున్నారు.. అయితే గూగుల్లో సెర్చ్ చేస్తే.. ఇది ప్రచారం కోసం చేసింది కాదని, నిజంగా జరిగిందని తేలింది.