https://oktelugu.com/

Kalki 2898 AD Release Trailer : కల్కి రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. ఎక్కువ హైలెట్ అయింది ఆ ఇద్దరే…

Kalki 2898 AD Release Trailer ఇక అందులో భాగంగానే ఈ ట్రైలర్ లో ఒక సాంగ్ ని కూడా రిలీజ్ చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

Written By: , Updated On : June 21, 2024 / 09:45 PM IST
Kalki 2898 AD Release Trailer Review

Kalki 2898 AD Release Trailer Review

Follow us on

Kalki 2898 AD Release Trailer : ఈనెల 27వ తేదీన భారీ అంచనాలతో రిలీజ్ అవ్వబోతున్న కల్కి సినిమాకి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ ని ఇంతకుముందే రిలీజ్ చేశారు. ఇక ఈ టైలర్ ను కనక మనం చూసుకున్నట్లయితే ప్రభాస్, అమితాబచ్చన్, దీపికా పదుకొనే లా క్యారెక్టర్లను ఎక్కువగా హైలెట్ చేశారు. ముఖ్యంగా ప్రభాస్ తన మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ ని ట్రైలర్లో రివిల్ చేయడం అనేది ఆయన అభిమానుల్లో జోష్ ను నింపే విషయం అనే చెప్పాలి.

ఇక అమితాబచ్చన్ క్యారెక్టర్ కూడా చాలా వైల్డ్ గా క్రియేట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన కొంతమంది ప్రాణాలను కాపాడే రక్షకుడిగా కనిపించబోతున్నాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ ట్రైలర్ లో కమల్ హాసన్ ని కూడా చూపించినప్పటికీ ఆయన క్యారెక్టర్ ను అయితే పూర్తి గా ఎస్టాబ్లిష్ చేయలేదు.

ముఖ్యంగా ప్రభాస్, అమితాబచ్చన్ క్యారెక్టర్ ని డీప్ గా ఎస్టాబ్లిష్ చేశారు. ఇక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒకానొక టైం లో అమితాబచ్చన్, ప్రభాస్ ఇద్దరూ కూడా ఫైట్ చేసుకున్నట్టుగా కనిపించింది. ఇక విజువల్స్ వండర్ ని సృష్టించబోతున్న ఈ సినిమాకు సంబంధించి మనం ఎంత మాట్లాడిన తక్కువే అవుతుంది. తన ఇమాజినేషన్ కి పదును పెట్టి నాగ్ అశ్విన్ ఈ సినిమాను చాలా గ్రాండ్ గా తీసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ట్రైలర్ ని మాత్రం మరోసారి ఎక్స్ ట్రా ఆర్డినరీ గా రిలీజ్ చేశాడు.

ఇక అందులో భాగంగానే ఈ ట్రైలర్ లో ఒక సాంగ్ ని కూడా రిలీజ్ చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక భారీ యుద్ధమే జరగబోతుంది అనేది చాలా క్లియర్ కట్ గా తెలియజేశారు. ఇక ట్రైలర్ మొత్తం అయిపోయిన తర్వాత ప్రభాస్ ఇంతవరకు నేను ఏ యుద్ధంలో ఓడిపోలేదు అనే డైలాగ్ మాత్రం ట్రైలర్ మొత్తానికే ఒక బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి…

Kalki 2898 AD Release Trailer - Telugu | Prabhas | Amitabh | Kamal Haasan | Deepika | Nag Ashwin