Viral Video : ఇంట్లో చెప్పే వచ్చావా తల్లీ.. పట్టు జారితే గాల్లోనే.. వైరల్ వీడియో

Viral Video : వైజాగ్ లో సముద్రపు అలతో ఫొటోలు దిగుతుండగా, ఆ అల వారిని మింగేసింది. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా యువతలో మార్పు మాత్రం రావడంలేదు.

Written By: NARESH, Updated On : June 20, 2024 9:26 pm

viral

Follow us on

Viral Video : ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేమస్‌ కావడానికి, లైకులు, షేర్స్ కోసం యువతీ యువకులు ప్రమాదకరంగా రీల్స్‌ చేస్తున్నారు. పడరాని పాట్లు పడుతున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి స్టంట్స్ చేస్తున్నారు. అప్పడప్పుడు పట్టు తప్పి ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అయినా యువతలో మార్పు రావడం లేదు. తాజాగా ఓ యువతి చేసిన స్టంట్‌ చూసి అందరూ షాక్‌ అవుతున్నారు.

ప్రమాదకరంగా వీడియో..
తాజాగా ఓ ఎత్తయిన బిల్డింగ్‌పై నుంచి ఓ యువతి ప్రమాదకరంగా వేలాడింది. ఆమె చేతిని ఓ యువకుడు పట్టుకున్నాడు. ఈ ప్రమాదకర స్టంట్‌ను ఫ్రెండ్స్ వీడియో తీశారు. ఏ మాత్రం పట్టుతప్పినా, యువతి కింద పడి చనిపోయే ప్రమాదం ఉంది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మండిపడుతున్న నెటిజన్లు
ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ మారింది. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతన్నారు. ఆ అమ్మాయికి ఏమన్నా పిచ్చా.. ఏదైనా పొరపాటు జరిగితే ప్రాణాలు అమాంతం గాల్లో కలిసిపోతాయి అంటూ కామెంట్ చేస్తుండగా. మరికొందరు ఇలాంటి పనికిమాలిన పనులు చేసేవారిని పోలీసులు వెంటనే శిక్షించాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే ఇలా చేసి ఏదైనా ప్రమాదం బారిన పడితే తల్లిదండ్రులకు శోకం మిగల్చడమే అని ఘాటుగా స్పందిస్తున్నారు.

ఇటీవలే రైలు ఢీకొని..
ఇటీవలే చాలా కాలం తర్వాత వస్తున్న రైలుతో సెఫ్పీ తీసుకుందుకు ప్రయత్నించిన యువతి అదే రైలు ఢీకొని మరణిచింది. కర్ణాటకలో హైదరాబాద్‌కు చెందిన యువకుడు జలపాతం వద్ద సెలీ‍్ఫ దిగుతూ అదుపు తప్పిం అందులో పడిపోయాడు. వైజాగ్ లో సముద్రపు అలతో ఫొటోలు దిగుతుండగా, ఆ అల వారిని మింగేసింది. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా యువతలో మార్పు మాత్రం రావడంలేదు.