Deepika Padukone – Ranveer Singh : దీపికా, రణ్ వీర్ సింగ్ నలుపు రంగు దుస్తుల్లో అక్కడకు ఎందుకెళ్లారు?

Deepika Padukone - Ranveer Singh ఐదేళ్ల వైవాహిక జీవితం తర్వాత 2018, నవంబర్ 14న వివాహం చేసుకున్న దీపిక పదుకొణె జంట ఈ ఏడాది 2023, ఫిబ్రవరిలో గర్భం దాల్చినట్లు ప్రకటించారు

Written By: NARESH, Updated On : June 20, 2024 9:09 pm

Deepika Padukone and Ranveer Singh's airport photos are viral

Follow us on

Deepika Padukone and Ranveer Singh : దీపికా పదుకొణె-రణ్ వీర్ సింగ్ తమ మొదటి బిడ్డ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముంబైలో జరిగిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న దీపికా తర్వాతి రోజు (గురువారం-జూన్ 20) తన భర్త రణ్ వీర్ తో కలిసి లండన్ బయల్దేరింది.

దీపిక బ్లాక్ కార్డిగాన్, వైట్ స్నీకర్స్‌తో బాడీకాన్ డ్రెస్ ధరించగా, రణ్ వీర్ బ్లాక్ టీ షర్ట్, మ్యాచింగ్ ప్యాంట్ ధరించాడు. ఉదయం ముంబై ఎయిర్ పోర్టులో కనిపించిన ఈ జంట వేషధారణతో పాటు ఆహ్లాదకరమైన హావభావాలతో కనిపించారు. వారు రాగానే రణ్ వీర్ కపూర్, దీపిక ఫొటోలకు ఫోజులిచ్చిన క్షణాలను నెటిజన్లు బంధించారు. అందమైన చిరునవ్వుతో దీపిక తన భర్త చేతిని పట్టుకొని ఎయిర్ పోర్ట్ ఎంట్రీ డోర్ వైపునకు వెళ్లింది.

ప్రెగ్నెన్సీ అనౌన్స్ తర్వాత ఈ జంట కనిపించిన ప్రతిసారీ ఒకే కలర్ దుస్తులతో ఉంటున్నారు. దీపిక బయటకు వచ్చిన ప్రతీసారి ఆమె పక్కనే ఉండడం, రక్షణగా నిలబడడం, ఆమెను విడిచి ఉండకపోవడం వారి అభిమానులు ప్రశంసిస్తున్నారు.

బుధవారం ముంబైలో జరిగిన నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఏడీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దీపిక హాజరవడం హైలైట్ గా నిలిచింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఉన్నారు. దీపిక తన సీట్లో నుంచి లేవగానే ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ఇద్దరూ ఆమెకు సాయం చేసేందుకు పరుగెత్తడం అందరినీ నవ్వించింది.

షూటింగ్ సమయంలో ప్రభాస్ అందించిన భోజనమే తన బేబీ బంప్ (కడుపుతో ఉన్న మహిళకు ఉన్న గుండ్రని పొట్ట)కు కారణమని దీపికా సరదాగా చెప్పింది. ‘ప్రభాస్ నాకు తినిపించిన ఆహారం వల్లే నేను ఇలా ఉన్నాను. ఇది ఇంట్లో వండిన ఆహారం కంటే ఎక్కువ ఫుల్ క్యాటరింగ్ సర్వీస్ లా అనిపించింది. ఆయన ఆస్వాదిస్తూ ఆహారం తీసుకుంటారు.’ అని దీపిక చెప్పింది.

ఐదేళ్ల వైవాహిక జీవితం తర్వాత 2018, నవంబర్ 14న వివాహం చేసుకున్న దీపిక పదుకొణె జంట ఈ ఏడాది 2023, ఫిబ్రవరిలో గర్భం దాల్చినట్లు ప్రకటించారు. 2024 సెప్టెంబర్ లో ఈ జంట బిడ్డకు జన్మనివ్వనుంది.