https://oktelugu.com/

OTT Release : ఆ క్రేజీ హారర్ థ్రిల్లర్ మరికొన్ని గంటల్లో ఓటీటీలో… ఎక్కడ చూడొచ్చు?

OTT Release అసలు ఈ బాక్ ఎవరు? శివాని ని ఎందుకు చంపాడు? ఆత్మగా మారిన శివాని తన పిల్లలను ఎలా కాపాడుకుంది? శివ శంకర్ బాక్ ని ఎలా ఎదిరించాడు? అనేది మిగతా కథ.

Written By:
  • NARESH
  • , Updated On : June 20, 2024 / 09:37 PM IST
    Follow us on

    OTT Release : ఓటీటీ ప్రియులు ఎక్కువగా హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడతారు. ఉత్కంఠ రేపే మలుపులతో, ఒళ్ళు గగుర్గొలిపే సన్నివేశాలతో సాగే హారర్ మూవీస్ వీక్షకులకు ట్రీట్ అని చెప్పాలి. కాగా ఈ వారం హారర్ చిత్రాలు ఇష్టపడే ఆడియన్స్ కోసం ఓ క్రేజీ థ్రిల్లర్ ఓటీటీలో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఆ చిత్రమే బాక్. దర్శకుడు సుందర్ సి అరణ్మనై సిరీస్లో భాగంగా బాక్ తెరకెక్కించాడు. ఇప్పటికే మూడు చిత్రాలు విడుదలయ్యాయి. అరణ్మనై 4 గా తమిళ్ లో విడుదలైన చిత్రాన్ని తెలుగులో బాక్ టైటిల్ తో విడుదల చేశారు.

    సీ సుందర్ దర్శకత్వం వహించి నటించాడు. తమన్నా, రాశి ఖన్నా కీలక పాత్రల్లో నటించారు. తమిళంలో ఈ చిత్రం సూపర్ హిట్. వంద కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. అరణ్మనై 4 మూవీ సమ్మర్ కానుకగా మే 3న విడుదల చేశారు. ఈ మూవీ థియేట్రికల్ రన్ ముగిసింది. ఈ క్రమంలో ఓటీటీ విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

    బాక్ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. జూన్ 21 నుండి బాక్ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. అంటే జూన్ 20 అర్థరాత్రి నుండే బాక్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. భయపెట్టే హారర్ సన్నివేశాలతో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ కూడా బాక్ చిత్రంలో ఉంది.

    బాక్ చిత్ర కథ విషయానికి వస్తే… శివ శంకర్(సీ సుందర్) వృతిరీత్యా లాయర్. అన్నయ్య శివ శంకర్ తో గొడవపడిన శివాని(తమన్నా) ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోతుంది. బాక్ అనే దుష్టశక్తి కారణంగా శివాని, ఆమె భర్త చనిపోతారు. చెల్లెలు మరణం వెనుక ఎవరున్నారని తెలుసుకునేందుకు శివ శంకర్ రంగంలోకి దిగుతాడు. అసలు ఈ బాక్ ఎవరు? శివాని ని ఎందుకు చంపాడు? ఆత్మగా మారిన శివాని తన పిల్లలను ఎలా కాపాడుకుంది? శివ శంకర్ బాక్ ని ఎలా ఎదిరించాడు? అనేది మిగతా కథ.