విజయీభవ ఆర్ట్స్ పతాకం పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్న చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. నూతన దర్శకుడు రాజ్ విరాట్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టాలెంటెడ్ హీరో నందు విజయ్ కృష్ణ, డస్కీ బ్యూటీ రష్మీ గౌతమ్ జంటగా నటిస్తున్నారు. ముందుగా టైటిల్ ఆ తరువాత విడుదల చేసిన టీజర్ తో అటు ఆడియెన్స్ లో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అనూహ్య స్పందన అందుకున్నారు బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలోనే నేడు బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రం ఆడియో ఆల్బమ్ నుంచి రాయే నువ్వు రాయే అనే పాటను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
Also Read: 18 పేజీస్ లో డైనిమిక్ హీరో నిఖిల్ కి జోడిగా అనుపమ
ఇక ఈ సినిమాలో నందు ప్రముఖ దర్శకుడు పూరీజగన్నాథ్ ఫ్యాన్ గా నటిస్తున్నాడు, నందు పోషించిన పోతురాజు పాత్ర వైవిధ్యంగా ఉండబోతుందని, నందు పాత్రకు ధీటుగా రష్మీ గౌతమ్ పాత్ర కూడా ఉండబోతుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రం షూటింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడదులకు సిద్ధంగా ఉందని చిత్ర నిర్మాతలు ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ తెలిపారు. లహరి మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో అందుబాటలో ఉంది.
నటీనటులు
నందు విజయ్ కృష్ణ, రష్మీ గౌతమ్
సాంకేతిక వర్గం
పీ.ఆర్.ఓ : ఏలూరు శ్రీను
పబ్లిసిటీ డిజైన్స్ : ధని ఏలే
ఎడిటర్ : బి. సుభాష్కర్
సినిమాటోగ్రఫీ : సుజాతా సిద్ధార్థ్
మ్యూజిక్ : ప్రశాంత్ ఆర్. విహారి
నిర్మాతలు : ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ
రచన – దర్శకత్వం : రాజ్ విరాట్
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Varun tej unveils the first audio single raye nuvu raye
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com