Special Story On Punishments: నేరం చేసిన వాడిని నిర్బంధించి వాడి చేత నిజం చెప్పించడానికి రకరకాల పద్ధతులు వాడతారు. కొన్నింటిని వింటేనే మనకు భయం కలుగుతుంది. ఇంకొన్ని చూస్తే జంకు పుట్టాల్సిందే. పూర్వ కాలం నుంచి కూడా నిందితుల నుంచి నిజం చెప్పించే క్రమంలో భయంకరమైన పద్ధతులు పాటిస్తున్నట్లు తెలుస్తోంది. వీటి గురించి అప్పుడప్పుడు సినిమాల్లో చూసినా నిజ జీవితంలో కూడా అత్యంత దారుణంగా ఉంటాయనేది సత్యం.
పూర్వ కాలంలో నిందితుల నుంచి నిజం రాబట్టడానికి ఒక మేకులు ఉన్న డబ్బాలో నిలబడి ఉంచేవారు దీంతో అతడు ఎటు కదిలినా అవి గుచ్చుకునేవి. ఫలితంగా రక్తం తీవ్రంగా స్రవించి మెల్లగా తన ప్రాణాలు కోల్పోయేవాడు దీంతో నిజం రాబట్టేందుకు విధించే శిక్షలు దారుణంగా ఉండేవి. మరో రకంగా చెప్పాలంటే రోమన్ లో నిందితుడిని పడుకోబెట్టి తాళ్లతో కట్టి అతడి కాళ్ల మీద ఓ రసాయన పదార్థం రాసేవారు. అప్పుడు ఓ మేకన వదిలితే అది అతడి కాళ్లను నాకుతూ ఉండేది. మొదట కితకితలు పెట్టినా తరువాత అతడి ప్రాణాలు పోయేవి.
ఇక తరువాత బాంబు ప్లాంట్ శిక్ష. ఇవి ఒక రోజుకు నాలుగైదు ఫీట్లు పెరుగుతాయి. దీంతో నిందితుడిని అడవిలోకి తీసుకెళ్లి ఆ మొక్కలను పదునుగా చెక్కి వాటిపై ఉంచేవారు. దీంతో అవి పెరుగుతూ అతడి శరీరంలోకి గుచ్చుకోవడంతో రక్తం కారి ప్రాణాలు వదిలేవాడు. ఇంకా మన దేశంలో కూడా కఠినమైన శిక్షలే ఉండేవి. నిందితుడి నుంచి నిజం చెప్పించే క్రమంలో అవలంభించే పద్ధతులు చూస్తేనే ఆశ్చర్యం వేయక మానదు.
ఏనుగుతో తొక్కించి చంపడం మరో పద్ధతి. నిందితుడిని అడవిలోకి తీసుకెళ్లి తాళ్లతో కట్టి పడుకోబెట్టేవారు అప్పుడు ఏనుగును వదిలి అతడి కాళ్లపై ఉండేలా శిక్షణ ఇచ్చే వారు . దీంతో అతడు నుజ్జునుజ్జయి ప్రాణాలు వదిలేవాడు. ఇలా చెప్పుకుంటూ పోతే శిక్షలు కఠినంగానే ఉండేవి. అందుకే తప్పు చేసిన వాడు తప్పించుకుంటేనే మంచిది. దొరికితే మాత్రం అతడికి నరకయాతనే. నిత్యం టార్చర్ భరించలేక చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
మరో పద్ధతిలో ఎండ వేడిమిని కూడా ఉపయోగించుకునే వారు. ఒక ఎద్దు లాంటి ఆకారంతో ఉన్న దాంట్లో నిందితుడిని ఉంచే వారు. దీంతో అతడు వేడికి కేకలు పెట్టినా అది సంగీతంలా వినిపించేదట. దీంతో అతడు ఎండ ధాటికి మాడి మసైపోయేవాడు. శిక్షలు ఇంత కఠినంగా ఉంటే ఇక తప్పు చేయడానికి కూడా ఎవరు ముందుకు రారు. ఇంతటి దారుణమైన శిక్షను భరించలేక కొందరు నిజం చెప్పినా ఇంకొందరు మాత్రం తమ ప్రాణాలే పణంగా పెట్టేవారని తెలుస్తోంది.