Yanam Yedurlanka Bridge: కుక్కకు విశ్వాసం ఎక్కువ. నక్కకు తెలివి ఎక్కువ అంటారు. విశ్వాసంలో కుక్కను మించిన వారు లేరు. అంతటి విశ్వాసం చూపించే కుక్క దానికి అన్నం పెడితే చాలు జీవితాంతం మన వెంటే ఉంటుంది. మనం చెప్పినట్లే వింటుంది. ఏవైనా చిన్న చిన్న పనులు కూడా చేస్తుంది. ఇలా పెంపుడు జంతువులు మనుషులకు నమ్మకంగా ఉంటాయి. యజమాని కోసం ఏం చేయడానికి సిద్ధపడతాయి. ఆపద సమయాల్లో కూడా అండగా నిలుస్తాయనడంలో అతిశయోక్తి లేదు.
యానాంలో..
కాకినాడ జిల్లా యానాంలో ఓ హృదయ విదారకర సంఘటన చోటుచేసుకుంది. ఓ యువతి జీవితంపై విరక్తితో చెప్పులు అక్కడే వదిలేసి గోదావరిలో దూకింది. విషయం తెలుసుకున్న ఆమె పెంపుడు జంతువు కుక్క ఆ చెప్పుల వద్దే అటు ఇటు తిరుగుతూ తన యజమాని వస్తుందన్న నమ్మకంతో రాత్రంతా అక్కడే పడిగాపులు కాయడం అక్కడున్న వారి మనసులను కలచి వేసింది.
రాత్రంతా..
పెంపుడు జంతువు అయినా యజమాని కోసం దాని తపన చూసే వారికి ఆశ్చర్యం కలిగించింది. చలిలో రాత్రంతా అక్కడే ఉండి తన యజమాని ఎటు నుంచి వస్తుందో అని దిక్కులు చూడటం అక్కడి వారిని కదిలించింది. మనసున్న మనిషికంటే నోరులేని జంతువులే మేలు. అన్నం పెట్టినందుకు రుణం తీర్చుకోవాలని ఆ శునకం పడే బాధ వర్ణనాతీతం.
విశ్వాసానికి..
మనిషి కంటే కుక్కే బెటర్. స్వార్థం కోసం కాకుండా యజమాని క్షేమమే ధ్యేయంగా అది అంత రిస్క్ తీసుకోవం గమనార్హం. అదే మనల్ని ఉండమంటే ఉంటామా? అమ్మో అని పారిపోతాం. కానీ అది మాత్రం తన యజమాని తిరిగి వస్తుందని దీనంగా చూడటం బాధగా అనిపించింది. ఇలాంటి సంఘటనలు అరుదుగా చోటుచేసుకుంటాయి. కుక్క చూపిన విశ్వాసానికి అందరు ఫిదా అవుతున్నారు.