https://oktelugu.com/

ఒకే ఒక్క హిట్ తో లిస్ట్ రెట్టింపైందిగా !

సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టి, సూపర్ హిట్ అవ్వడంతో సాయి తేజ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టు అయింది. దాంతో, వరుస సినిమాలను సెట్ చేసుకుంటున్నాడు. ప్రసుతం సెట్ మీద ఒక సినిమా ఉంది, అలాగే కరోనా అనంతరం మరొకటి సెట్ మీదకు వెళ్లనుంది. ఇవి కాకుండా ఆల్ రెడీ మరో కథను ఓకే చేశాడు. ఇన్ని సినిమాలను చేతిలో వుంచుకున్న సాయి […]

Written By: , Updated On : August 23, 2020 / 05:04 PM IST
Follow us on


సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టి, సూపర్ హిట్ అవ్వడంతో సాయి తేజ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టు అయింది. దాంతో, వరుస సినిమాలను సెట్ చేసుకుంటున్నాడు. ప్రసుతం సెట్ మీద ఒక సినిమా ఉంది, అలాగే కరోనా అనంతరం మరొకటి సెట్ మీదకు వెళ్లనుంది. ఇవి కాకుండా ఆల్ రెడీ మరో కథను ఓకే చేశాడు. ఇన్ని సినిమాలను చేతిలో వుంచుకున్న సాయి తేజ్, ఇప్పుడు కొత్తగా మరో సబ్జెక్ట్ ను విన్నాడట. కథ బాగుండటంతో గత పది రోజుల నుండి ఆ కథ మీదే డిస్కషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

Also Read: చైతు ‘లవ్ స్టోరీ’కి 40 కోట్లు !

ఈ సబ్జెక్ట్ ను రైటర్ కోన వెంకట్ తెచ్చాడని, దాదాపు సినిమా కూడా ఓకె అయిందని తెలుస్తోంది. ఈ సబ్జెక్ట్ లో హీరో డాక్టర్ గా కనిపిస్తాడట. మెడికల్ బ్యాక్ గ్రౌండ్ లోని లొసుగులను ఈ కథలో ప్రస్తావించబోతున్నారట. మొత్తానికి ఈ కథ తనకు బాగా నచ్చిందని.. ముఖ్యంగా వైద్య నేపథ్యంలో కథ చేస్తే. తనకు ఫ్రెష్ గా ఉంటుందని సాయితేజ ఫీల్ అవుతున్నాడు. మరి ఈ సినిమాని ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి. ప్రస్తుతం సాయి తేజ్ సోలో బతుకే సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు.

Also Read: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ ఎప్పుడంటే…

అలాగే కరోనా అనంతరం దేవా కట్టా డైరక్షన్ లో ఓ థ్రిల్లర్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి భగవాన్ పుల్లారావు నిర్మాత. ఆయన ఇప్పటికే ఈ సినిమాని నవంబర్ నుండి లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఆ తరువాత బివివిఎస్ఎన్ ప్రసాద్ కి సాయి తేజ్ మళ్లీ మరో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆయనకు కథ ఇంకా సెట్ కాలేదు. బహుశా ఈ కథను ఆయన దగ్గరకు పంపుతాడేమో చూడాలి. అలాగే ఆ మధ్య సాయి తేజ్ కి, గోపీచంద్ మలినేని కూడా ఓ స్క్రిప్ట్ చెప్పాడు. అది కూడా సాయి తేజ్ లిస్ట్ లో ఉంది. మొత్తానికి ‘ప్రతిరోజూ పండగే’ అనే ఒకే ఒక్క హిట్ తో సాయి తేజ్ లిస్ట్ రెట్టింపైంది.