Veera Simha Reddy- Prabhas: సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా అన్ని రకాల సినిమాలు మన ముందుకు వచ్చేస్తాయి..అలా ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మరియు నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ సినిమాలు మన ముందుకు వచ్చాయి..మాస్ ఆడియన్స్ రెండు సినిమాలు బాగా నచ్చుతాయి..కానీ ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం కాస్త ఎక్కువ నచ్చుతుందనే చెప్పాలి..ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చిరంజీవి సినిమాకే ఎక్కువ మొగ్గు చూపుతారు.

ఈ రెండు సినిమాలను చూడడానికి కేవలం అభిమానులు మాత్రమే కాదు, సినీ సెలబ్రిటీస్ కూడా థియేటర్స్ కి క్యూ కట్టేస్తున్నారు..ఈరోజు మధ్యాహ్నం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రసాద్ మల్టిప్లెక్స్ లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చూడడానికి విచ్చేశాడు..దానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..ఇప్పుడు లేటెస్ట్ గా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాలయ్య బాబు ‘వీర సింహా రెడ్డి’ సినిమా చూడడం కోసం AMB సినిమాస్ కి విచ్చేశాడు.
‘వాల్తేరు వీరయ్య’ సినిమా విడుదల రోజు ఆ సినిమాని చూడకుండా ‘వీర సింహా రెడ్డి’ సినిమాని చూడడం పై కొంతమంది మెగా అభిమానులు తప్పుబడుతున్నారు..నీకు మెగాస్టార్ చిరంజీవి కంటే బాలయ్య బాబే ఎక్కువనా?, మా చిరంజీవి సినిమాని చూడవా అంటూ ప్రభాస్ ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు మెగా ఫ్యాన్స్..ఈమధ్య కాలం లోనే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం లో పాల్గొన్నాడు ప్రభాస్.

ఈ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా ఆహా మీడియా లో అప్లోడ్ చెయ్యగా వాటికి ఎలా రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే..ఈ ఎపిసోడ్ షూటింగ్ సమయం లో బాలయ్య మరియు ప్రభాస్ మధ్య మంచి స్నేహం ఏర్పడిందని..ఆ చొరవతోనే బాలయ్య బాబు తన సినిమాని చూడాల్సిందిగా రిక్వెస్ట్ చెయ్యగా ప్రభాస్ వచ్చి చూసాడంటూ అభిమానులు చెప్తున్నారు..ఇక ప్రభాస్ ఇంస్టాగ్రామ్ స్టోరీ నుండి ఈ క్రేజ్ ప్రాజెక్ట్ పై ఏమైనా మాట్లాడుతాడో లేదో చూడాలి.