Veera Simha Reddy Collections: అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని తో నందమూరి బాలకృష్ణ చేసిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం మొన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై యావరేజి టాక్ ని తెచ్చుకుంది..ఫస్ట్ హాఫ్ అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా బాగా అలరించినప్పటికీ సెకండ్ బాగా తగ్గడం తో ఆశించిన స్థాయి టాక్ రాలేదు..కానీ టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు ఓపెనింగ్స్ అయితే కళ్ళు చెదిరిపొయ్యే రేంజ్ లో వచ్చాయి.

‘ఈ ఓపెనింగ్స్ నిజంగా బాలయ్య సినిమాకే వచ్చాయా’ అని ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపొయ్యే రేంజ్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం..ముఖ్యంగా సీడెడ్ లో ప్రాంతం ఈ సినిమాకి మొదటి రోజు వచ్చినంత వసూళ్లు నేటితరం స్టార్ హీరోలకు కూడా రాలేదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు..అంతటి బంపర్ ఓపెనింగ్ ని తెచ్చుకున్న ఈ చిత్రానికి రెండవ రోజు మాత్రం చాలా తక్కువ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.
ఎందుకంటే నిన్న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా విడుదల అవ్వడం వల్ల ఆ సినిమా ప్రభావం ‘వీర సింహా రెడ్డి’ పై చాలా తీవ్రంగా పడింది..మార్నింగ్ షోస్ మరియు మాట్నీ షోస్ కి బాగా ఎఫెక్ట్ అవ్వగా, ఫస్ట్ షోస్ మరియు సెకండ్ షోస్ కాస్త మంచి ఆక్యుపెన్సీ తెచ్చుకుంది..అలా రెండవ రోజు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కి కలిపి ఈ సినిమాకి దాదాపుగా 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

మొదటి రోజు వచ్చిన 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు ఎక్కడా, రెండవ రోజు వచ్చిన 5 కోట్ల రూపాయిల షేర్ ఎక్కడ..ఏ రేంజ్ డ్రాప్స్ అయ్యాయో మీరే గమనించండి..ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాకి ప్రీమియర్స్ తర్వాత మొదటి రోజు కేవలం 40 వేల డాలర్లు మాత్రమే వచ్చాయి..తెలుగు సినిమా చరిత్ర లో ప్రీమియర్స్ నుండి 7 లక్షల డాలర్లు వసూలు చేసిన చిత్రానికి మొదటి రోజు కేవలం 40 వేల డాలర్స్, అంటే 94 శాతం కి పైగా డ్రాప్స్ పడడం ఎప్పుడూ జరగలేదని తెలుస్తుంది.