Vishwak Sen- Devi Nagavalli: న్యూస్ ప్రెజెంటర్ అంటే స్క్రిప్ట్ యధాతంగా చెప్పడం కాదు. తన మార్కు చూపించడం.. మొట్టమొదట ప్రారంభమైన న్యూస్ ఛానల్ కాబట్టి… టీవీ9లో చాలా మందికి ఆ లిబర్టీ ఉంటుంది.. అందులో దేవి నాగవల్లి అలియాస్ దాసరి నారాయణరావు మనమరాలికి కొంచెం ఎక్కువే ఉంటుంది. నచ్చిన కెరియర్ కోసం.. నచ్చని పెళ్లి అనే బంధం నుంచి బయటకు వచ్చింది. దీనిపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండవచ్చు. ఫైనల్ గా ఆమె జీవితం ఆమె ఇష్టం. వార్తలు చెప్పినా, బిగ్ బాస్ హౌస్ లో నిలపడలేకపోయినా దేవీ నాగవల్లిది ఒక స్పెషల్ క్యారెక్టర్. ఆమధ్య విశ్వక్సేన్ పాగల్ సినిమా ఇంటర్వ్యూలో.. చేసిన ఒక ఫ్రాంక్ వీడియోను ఉద్దేశించి ఆమె చేసిన గేట్ అవుట్ వ్యాఖ్య ఎంతటి సంచలనం సృష్టించిందో తెలుసు కదా. ఇందులో ఓ వర్గం దేవిదే తప్పు అంటే.. వర్గం విశ్వక్సేన్ పై వేలు ఎత్తి చూపింది. ఇంత చేసినప్పటికీ ఆ పాగల్ సినిమా పిచ్చి సినిమా అయిపోయింది..

చల్లారిపోయిందా
పాపం దేవి నాగవల్లికి ఆవేశం ఎక్కువ.. భాష మీద పట్టు తక్కువ. ఇప్పుడున్న రోజుల్లో ఎవరికి తెలుగు వస్తోంది కనుక.. అప్పుడెప్పుడో రుధిర వర్షాన్ని కురిపించిన ఆమె నోరు.. ఇప్పుడు చప్పున చల్లారినట్టే కనిపిస్తోంది. ఇలా ఎందుకు అనిపిస్తోందంటే ఆ పాగల్ విశ్వక్సేన్ అలియాస్ మాస్ కా దాస్ స్వయంగా మెగా ఫోన్ పట్టుకున్నాడు.. అసలే మెంటల్ క్యారెక్టర్ కదా.. చక చకా సినిమా తీసి పారేశాడు. తనకు సన్నిహితమైన నివేదా పేతు రాజ్ ను పెట్టుకున్నాడు. ఇద్దరు కూడా సహజీవనం చేస్తున్నారని టాక్. సరే ఈ విషయం పక్కన పెడితే ఆ సినిమా పోస్టర్, ఒక చిన్నపాటి వీడియోను బాలకృష్ణ వెళ్లి ఆవిష్కరించాడు.. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ సదరు విశ్వక్సేన్ ఈ సినిమాలో టీవీ9 దేవిని ఉద్దేశించి ఒక చిల్లర, వెగటు సీన్ పెట్టాడు. గతంలో వీరి మధ్య జరిగిన పాత వివాదం తెలుసు కదా! మరి హీరో కదా పైగా బాలయ్య లాంటి ఉద్దండుడి ప్రోత్సాహం ఉంది. ఇంకేముంది అంతటి అర్జున్ సినిమాను కూడా పక్కన పెట్టాడు. అసలు విశ్వక్ సేన్ ఏం చేసినా ఒక వివాదమే. నిండా అహం, పైగా తల పొగరు.. అతని నుంచి ఇంతకంటే ఎక్కువ ఏం ఆశించగలం.. బహుశా విశ్వక్ ప్రవర్తనను ఇప్పట్లో అర్జున్ మర్చిపోకపోవచ్చు.
టీవీ9 వివాదం అక్కడే సమసి పోయింది. ఇంకా గెలికితే పెంట అవుతుంది.. కానీ దాన్ని విష్వక్ అలాగే కడుపులో ఉంచుకున్నాడు.. తాను తీస్తున్న సినిమా కాబట్టి… దేవి అంటే కోపం ఉంది కాబట్టి… తన చిల్లర తనాన్ని మరోసారి ప్రదర్శించాడు.. ఈ దమ్కీ అనే సినిమాలో కారులో తను వెళుతూ ఉంటాడు. పక్కన హీరోయిన్ కూర్చుంటుంది.. ఒక ముద్దు పెడుతుంటుంది. హీరో కదా… అందులో తానే దర్శకుడు. సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు.. మెడికల్ షాప్ దగ్గర ఆపాలా అని అడుగుతాడు.. ఇందులో ఎంత దరిద్రం ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి విశ్వక్ కదా ఆ మాత్రం దేడ్ దిమాక్ సీన్లు లేకపోతే ఎలా? బండ బూతులు లేకపోతే ఎలా? ఆ హీరోయిన్ వెంటనే గేట్ అవుట్ ఫ్రమ్ మై కార్ అంటుంది.. అర్థమైంది కదా ఈ సీన్ ఎవరి మీద ప్రతికారమో… అతడి అభిరుచి స్థాయి ఏంటో?

సాధారణంగా చిన్న చిన్న విషయాలకే దేవి నాగవల్లి రియాక్ట్ అవుతూ ఉంటుంది. తన జర్నలిస్టు టెంపర్ మెంట్ చూపిస్తూ ఉంటుంది. కానీ పాపం టీవీ9 రెండో స్థానంలోకి పడిపోయాక మునిపటి టెంపర్ మెంట్ దేవిలో కనిపించడం లేదు. ఏదో యాత్ర అని టీవీ9 లో ఒక ప్రోగ్రాం మొదలుపెట్టారు. పాపం అది బొక్క బోర్లా పడ్డది. ఎన్ టివి దూసుకొస్తున్న తర్వాత టీవీ9 లో మునుపటి జోష్ కనిపించడం లేదు.. అ దూకుడు కూడా కనిపించడం లేదు.. కొసాఖరికి తమ కీలక ఉద్యోగి పట్ల ఎవరో పరాభవ ధోరణితో సినిమాలో సీన్ పెడితే స్పందించే పరిస్థితి కూడా లేదు. తోటి మహిళా జర్నలిస్టులు కూడా సైలెంట్ అయ్యారు.. పాపం ఆ ప్రగతిశీల విప్లవ చైతన్య అభ్యుదయ మహిళలు కూడా ఈమెకు సపోర్ట్ గా లేరు.. బాలయ్య సపోర్ట్ గా ఉన్నాడు కాబట్టి విశ్వక్ సేన్ ను చూసి భయపడుతున్నారా? లేకుంటే ఆ తిక్కల్ది దేవి కి తగిన శాస్తి జరగాల్సిందే అని సంబరపడుతున్నారా.. ఏమో కొన్ని మౌనాలు ఎప్పటికీ అర్థమవవు.
