Homeఎంటర్టైన్మెంట్Venu Swamy: టాలీవుడ్‌ లో ఆ యంగ్‌ హీరో, హీరోయిన్‌కు మృత్యువు తప్పదు.. బాంబు పేల్చిన...

Venu Swamy: టాలీవుడ్‌ లో ఆ యంగ్‌ హీరో, హీరోయిన్‌కు మృత్యువు తప్పదు.. బాంబు పేల్చిన వేణుస్వామి!

Venu Swamy
Venu Swamy

Venu Swamy: సినీ, రాజకీయ ప్రముఖులు జోతిష్యాన్ని, సెంటిమెంట్లను ఎక్కువగా విశ్వసిస్తారు. ఇందు కోసం వారికి నమ్మకమైన జోతిష్యులకు ఎంచుకుని వారు చెప్పింది ఫాలో అవుతారు. గుళ్లు, గోపురాలు తిరుగుతారు. పూజలు, పునస్కారాలు చేస్తారు. కొంతమంది వస్త్రధారణలో రంగులు పాటిస్తారు. రింగులు, లాకెట్స్‌ ధరిస్తారు. ఇక కొంతమంది జ్యోతిష్యులు సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఫేమస్‌ అవుతుంటారు. తమకు ఆదాయ వనరుగా మార్చుకుంటారు. అయితే, తాజాగా ఓ జోతిష్యుడు చెప్పిన జాతకం వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

ఆ మరణాలు ముందే తెలుసా..
సినిమా పరిశ్రమలో చాలా మంది సెలబ్రిటీలకు జ్యోతిష్యం చెబుతుంటారు ప్రముఖ ఆస్ట్రాలజీ నిపుణుడు వేణుస్వామి. ప్రస్తుతం వేణుస్వామి రెండు నెలల క్రితం ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. అందుకు కారనం ఆ వీడియోలో త్వరలోనే టాలీవుడ్‌ హీరో, హీరోయిన్‌ చనిపోతారని జోతిష్యం చెప్పాడు. వేణుస్వామి.. సెలబ్రిటీలకు జోతిష్యాలు చెబుతూ.. ఇండస్ట్రీలో సెలబ్రిటీగా మారాడు. ఆయన చెప్పినవి చెప్పినట్లుగా జరుగుతుండటంతో అతడి జోతిష్యంపై సెలబ్రిటీలకు నమ్మకం కలిగి అతడి వద్దకు వెళ్లి తమ భవిష్యత్‌ ఎలా ఉందో చూపించుకుంటున్నారు. ఇక తాజాగా తారకరత్న మరణంతో సినిమా ఇండస్ట్రీతోపాటుగా రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు శోక సంద్రంలో మునిగారు. ఈ క్రమంలోనే వేణుస్వామి రెండు నెలల కిందట ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్‌గా మారింది. ఆ ఇంటర్వ్యూలో టాలీవుడ్‌లో త్వరలో ఓ యంగ్‌ హీరో చనిపోతాడు అని చెప్పాడు. తాజాగా తారకరత్న మరణించడంతో వేణుస్వామి వీడియో వైరల్‌గా మారింది.

Venu Swamy
Venu Swamy

హీరో ఆయనేనా.. మరి హీరోయిన్‌ ఎవరు?
ఆ వీడియోలో వేణుస్వామి టాలీవుడ్‌ లో ‘త్వరలో ఓ యంగ్‌ హీరో, హీరోయిన్‌ చనిపోతారని వారి వయసు 45 ఏళ్లలోపే ఉంటుంది. అదీకాక మేష రాశికి చెందిన హీరోయిన్, వృశ్చిక లేదా మిథున రాశికి చెందిన హీరో చనిపోతాడు. ఆ మరణం ఆత్మహత్య కావొచ్చు లేదా సహజ మరణం కావొచ్చు’ అని వెల్లడించారు. అయితే అతడు చెప్పినట్లుగానే 40 సంవత్సరాలు ఉన్న తారకరత్న మరణించడంతో ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక్కసారిగా వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే హీరోయిన్‌ కూడా మరణిస్తుంది అని చెప్పడంతో.. ఇప్పుడు ఆ హీరోయిన్‌ ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. గతంలో చాలా మంది సెలబ్రిటీల విషయంలో వేణుస్వామి చెప్పినవి చెప్పినట్లే జరిగాయి. దాంతో సెలబ్రిటీలు ఇతడి దగ్గరికి క్యూ కట్టారు. ఇప్పటికే రష్మిక మందన్న, కృతిశెట్టి వేణుస్వామి సూచనలతో పూజలు కూడా చేసినట్లు సమాచారం.

 

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version